India-Pakistan: బంకర్‌లోకి పాక్‌ ఆర్మీ ఛీప్‌.. పాకిస్థాన్‌ విడిచిపోతున్న ప్రముఖులు.. ఏ క్షణంలోనైనా యుద్దం!

Published : Apr 26, 2025, 12:09 AM ISTUpdated : Apr 26, 2025, 12:12 AM IST

India-Pakistan: జమ్మూకశ్మీర్‌ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పాక్‌- ఇండియా ఎల్‌వోసీ వెంబడి భారీగా బలగాలను రెండు దేశాలు మోహరించాయి. ఇక భారత్‌ ప్రతికారం గట్టిగా తీర్చకోబోతుందని గమనించిన పాకిస్తాన్‌ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్మీ దళాలను బంకర్లలోకి వెళ్లిపోవాలని వాళ్ల ఆర్మీ చీఫ్‌ సూచించాడు. 

PREV
15
India-Pakistan:  బంకర్‌లోకి పాక్‌ ఆర్మీ ఛీప్‌.. పాకిస్థాన్‌ విడిచిపోతున్న ప్రముఖులు.. ఏ క్షణంలోనైనా యుద్దం!

ఇప్పటికే భారత్‌ ప్రతిదాడికి దిగుతుందన్న సమాచారంతో పాక్‌ ఆర్మీ చీఫ్‌ కూడా బంకర్లలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బంకర్ల నుంచే భారత్‌ సరిహద్దులను పాక్‌ సైన్యం గమనిస్తోంది. మరోవైపు యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ప్రముఖులు దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య యుద్దవాతావరణం నెలకొనబోతోందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

25

పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్‌కు గట్టి షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం భద్రతను బలోపేతం చేసిందని, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వైపు దళాల మోహరింపును పెంచిందని తెలుస్తోంది. సైనికులు బంకర్లలోనే ఉండి ఎల్‌ఓసి వెంబడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్మీ చీఫ్‌ ఆదేశించారు. 

35

న్యూఢిల్లీ నుంచి బలమైన ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఘటనను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పాక్‌లోని రావల్‌పిండిలో ప్రధాన కార్యాలయం ఉన్న పాకిస్తాన్ సైన్యానికి చెందిన 10వ కార్ప్స్‌ను అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో, గుజ్రాన్‌వాలాలో ప్రధాన కార్యాలయం ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా ఉన్న సియాల్‌కోట్ డివిజన్‌ను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

45

పాక్‌ - భారత్‌ మధ్య ఇప్పటికే అనేక ఒప్పందాలు రద్దయ్యాయి. సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలనే తన నిర్ణయాన్ని భారత్‌ పాకిస్తాన్‌కు తెలియజేసింది. భారత జల వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జల వనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు రాసిన లేఖలో ఈ నిర్ణయం గురించి వివరించారు. "పాకిస్తాన్ కొనసాగించే సీమాంతర ఉగ్రవాదాన్ని మేము చూశాం" అని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాక్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది.  భారతదేశం చర్యకు ప్రతీకారంగా, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని, ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది. పాకిస్తాన్ మంత్రులు అన్ని వాణిజ్యాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత విమానయాన సంస్థలకు పాక్‌  గగనతలంపై రాకపోకలు సాగించవద్దని సూచించాయి. 

 

55

ఇస్లామాబాద్ వాఘా సరిహద్దు పోస్టును కూడా పాక్‌ మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) కింద భారతీయులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను వెళ్లిపోవాలని కోరింది. భారత్‌ కూడా అదేవిధంగా పాక్‌కు బదులిచ్చింది. ఇండియాకు వీసాపై వచ్చిన వారు 48 గంటల్లో తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. 

Read more Photos on
click me!

Recommended Stories