India Justice Report: మహిళలు అన్నింటిలో సమానం.. పోలీసు దళంలో కాదు.. కిందిస్థాయిలోనే మిగిలిపోతున్నారట!

మన దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో కూడా సమాన హక్కులను చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. కానీ పోలీసుశాఖలో ఉన్నత ర్యాంకుల్లో పనిచేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోందని సర్వే చెబుతోంది. దీంతోపాటు న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం ఇలా మొత్తం నాలుగు రంగాల్లో మహిళా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను ఇటీవల ఓ సంస్థ సేకరించింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 
 

Women Still Missing in Action: Only 10% in Top Police Ranks, Report Reveals Alarming Gaps in telugu tbr

పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసుల పాత్ర కూడా చాలా కీలకం. అయితే మన దేశంలో పోలీసు దళంలో డైరెక్టర్ జనరల్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ వంటి సీనియర్ పదవుల్లో 1,000 కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారంట. పోలీసింగ్‌లో 90 శాతం మంది మహిళలు దిగువస్థాయిలో పనిచేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ వివరాలను టాటా ట్రస్ట్స్ ప్రారంభించిన అనేక పౌర సమాజ సంస్థలు, డేటా భాగస్వాముల సపోర్టుతో ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025 నివేదిక ప్రకారం.. పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం అనే నాలుగు రంగాలలో మహిళా ఉద్యోగుల సంఖ్యను ట్రాక్ చేశారు. 

women employees

పోలీసు శాఖలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఇందులో కేవలం 960 మంది మాత్రమే ఇండియన్ పోలీస్ సర్వీస్ ర్యాంకుల్లో ఉన్నారు. 24,322 మంది డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, నాన్-ఐపీఎస్ ఆఫీసర్ పదవుల్లో ఉన్నారు. ఇక ఇండియన్‌ పోలీసు సర్వీసుల్లో 5,047 మంది అధికారులు ఉన్నారు. పోలీసు కానిస్టేబుళ్లలో 2.17 లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. దీంతో కింది స్థాయిలోనే 90 శాతం మంది పనిచేస్తుండటం గమనార్హం. అత్యధిక సంఖ్యలో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ 133 మందితో అగ్రస్థానంలో ఉంది.


మధ్యప్రదేశ్‌ తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక 2019 మరియు 2023 మధ్యకాలంలో దాదాపు 78 శాతం పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలు ఉన్నాయి, 86 శాతం జైళ్లలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు ఉన్నాయి. న్యాయ సహాయం కోసం తలసరి వ్యయం దాదాపు రెట్టింపు అయి రూ. 6.46 కు చేరుకుంది. అదే కాలంలో జిల్లా న్యాయవ్యవస్థలో మహిళల వాటా కూడా 38 శాతానికి పెరిగింది.

National Girl Child Day 2022- 7 business leaders every girl can look up to

ఇక జిల్లా న్యాయవ్యవస్థలో షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ కులాల వాటా వరుసగా 5 శాతం, 14 శాతం మందే మహిళలు ఉన్నారు. ఈ వర్గాలు పోలీసు దళంలో, ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 12 శాతం ఉన్నారు, వీరికి కేటాయించిన రిజర్వేషన్ల కంటే చాలా తక్కువ ఉన్నారని నివేదకలో పేర్కొన్నారు. చట్టపరమైన సహాయం పొందడానికి కీలకంగా ఉండే పారాలీగల్ వాలంటీర్లు ఐదు సంవత్సరాలలో 38 శాతం మంది మహిళలు తగ్గారట. ఇప్పుడు లక్ష జనాభాకు 3 పీఎల్‌వీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా జైళ్లలో 25 మంది మహిళా మానసిక వైద్యులు అందుబాటులో ఉన్నారని నివేదిక పేర్కొంది.

మహిళా ఉద్యోగాలు న్యాయవ్యవస్థలో అతి తక్కువగా ఉన్నారు. భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు కేవలం 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఇది 1987లో లా కమిషన్ ప్రకారం.. 50 మంది కనీసం ఉండాల్సి ఉండగా.. అంతకంటే తక్కవ మంది ఉన్నారు. మహిళా ఉద్యోగులు హైకోర్టులు 33 శాతం, జిల్లా కోర్టులు 21 శాతం ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో అలహాబాద్, మధ్యప్రదేశ్ వంటి హైకోర్టులలో ఒక్కో న్యాయమూర్తికి 15,000 కేసులు వరకు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు సగటున ఒక్కొక్కరు 2,200 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

विभिन्न राज्यों की सरकारें लगातार इस पर रोक लगाने के लिए प्रयास कर रही हैं। कई जगहों पर केन्द्रीय रिजर्व पुलिस बल या दूसरे अर्ध सैनिक बल भी इनसे मुकाबले के लिए तैनात किए गए हैं।

జైలులో ఖైదీల సంఖ్య పెరుగుతుండగా.. అందుకు తగ్గట్లు మహిళా ఉద్యోగులు అక్కడ లేని పరిస్థితి. జైళ్లలో వైద్య సిబ్బంది లేని పరిస్థితి, ఖైదీ-డాక్టర్ నిష్పత్తి 300:1కి ప్రస్తుతం 775:1 మంది ఉన్నారు. హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక పెద్దరాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 1000:1 మించిపోయింది. ఇక 2022 మరియు 2025 మధ్య పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలలో బీహార్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా అత్యధిక మెరుగుదల కనిపించింది. 

ఇక 2030 నాటికి భారతదేశంలోని జైలు ఉండే ఖైదీలు 6.8 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో  వ్యవస్థాగత సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాల్లో మహిళలను ప్రోత్సహించకపోతే న్యాయ వ్యవస్థ బలహీనులు, అణగారిన వర్గాలపై అసమాన భారాన్ని మోపనుంది. తాజా నివేదిక కోసం సర్వే టీం.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ, నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ మరియు ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా వంటి అధికారిక పోర్టల్‌ల నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. 

Latest Videos

vuukle one pixel image
click me!