2611 Mumbai attack accused Tahawwur Rana (File image)
ముంబయి నగరంపై 2008లో జరిగిన ఉగ్రమూకల దాడి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి మనసు చలించిపోతుంది. ఈ ఘటనలో 170 మంది పౌరులు మృతి చెందారు. అలాంటి ఘాతుకానికి ఓడిగట్టిన, దాడులు జరిపేందుకు ప్లాన్ చేసిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు తహవూర్ రాణా భారత్‌కు తిరిగొస్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. గురువారం ఉదయానికి తహవూర్ రాణా ఇండియాకు తీసుకొస్తున్నట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరాల్లో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక తహవూర్ రాణా చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. భయంకరమైన తీవ్రవాదిని భారత్ ఏం చేస్తుందంటే..
रिलेटेड इमेज: लखनऊ में संदिग्ध आईएसआई एजेंट गिरफ्तार
ముంబయిలోకి నవంబర్ 26, 2008లో పాకిస్తాన్‌కి చెందిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంగుండా ముంబయికి వచ్చి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపారు. ముందుగా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నరిమన్ హౌస్, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో భయంకరమైన ఆయుధాలతో గ్రనేడ్లు, బాంబులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా మారణహోమం జరిగింది. సుమారు 175 మంది ప్రాణాలు కోల్పోగా.. 600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్దారు. సుమారు 60 గంటలపాటు దాడులుపాటు భారత ఎన్‌ఎస్‌జీ కమాండోలు తొమ్మిది మంది తీవ్రవాదులను అంతం చేశారు. కసబ్‌ను మాత్రం పట్టుకుని ఉరితీశారు.
Representative image of 2611 Mumbai terror attack (PhotoIndia at UN Twitter)
ముంబయి దాడులకు వెనుకుండి ప్లాన్ చేసింది, ప్రోత్సహింది మొత్తం తహవూర్ రాణా అని నిఘావర్గాలు తేల్చాయి. అతన్ని పట్టుకునేందుకు అప్పటి నుంచి భారత్ విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే.. అమెరికా అతన్ని పట్టుకుని అక్కడి జైళ్లో ఉంచింది. పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా భారతీయుడు అయిన తహవూర్ వ్యాపారవేత్త. ఈక్రమంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో రాణా యాక్టివ్ మెంబర్‌గా ఉన్నాడు. ముంబయిలో ఏయే ప్రాంతాలను లక్ష్యం చేసుకోవాలి. ఎలా టార్గెట్ రీచ్ కావాలని అన్న ప్రణాళిక రాణాదే. దీంతోపాటు పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి అనేక అంతర్గత పత్రాలను అందించడంలో రాణా పాత్ర ఉంది. ఇక పాకిస్థాన్ ఐఎస్‌ఐ సంస్థతో కూడా రాణా కలిసి పనిచేసి ఉగ్రవాదులు భారత్‌కు క్షేమంగా చేరుకోవడానికి సహాయపడ్డాడు.
terrorist
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో తహవూర్ రాణాను అక్కడి సిబ్బంది భారత్‌కు పంపుతున్నారు. 2020 నుంచి అతన్ని అప్పగించాలని భారత్ కోరుతున్నా.. చట్టపరమైన చిక్కులతో అది సాధ్యపడలేదు. ఇక రాణాను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పగిస్తానని ఒప్పుకున్నారు. అయితే.. తనకు భారత్ వెళ్లేందుకు ఇష్టం లేదని అమెరికాలో ఉంటానని రాణా అగ్రరాజ్యం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసుకున్నారు. దీన్ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల రాణా లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఇప్పటి వరకు ఉంటున్నాడు.
Indian Army
ఇండియాకు రావడం తనకు ససేమిరా ఇష్టం లేదని రాణా చెబుతున్నాడు. భారత్‌కు వస్తే తనను చిత్రహింసలకు గురిచేస్తారని అమెరికా కోర్టులను ఆశ్రయించాడు. అయినా అక్కడ ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు భారత్ బలగాలు అతన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే భారత అధికారుల బృందం అమెరికా వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసేసింది. ఈరోజు రాత్రికి లేదా బుధవారం రాణా వస్తాడని అధికారులు చెబుతున్నారు.
Pakistan Terrorist Organizations
రాణాతోపాటు అనేకమంది నేరగాళ్లను భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్ తెలిపారు. రాణాను భారత నిఘా, దర్యాప్తు అధికారుల ప్రత్యేక బృందంతో కలిసి తీసుకొస్తున్నారు. ఆయన్ని ప్రత్యేక విమానం ద్వారా న్యూఢిల్లీ చేరుకునే ముందే ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఆపుతారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియాకు వచ్చిన తర్వాత రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. తొలుత న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని జైల్లో పెట్టనున్నారు.