Miss World 2025: మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను ఉచితంగా చూసే అవ‌కాశం.. పాస్‌లు ఎలా పొందాలంటే

Published : May 08, 2025, 02:39 PM IST

ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన అందాల పోటీ, మిస్ వరల్డ్ 2025 ఈసారి హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా జరగనున్న విష‌యం తెలిసిందే. ఇందుకోసం భాగ్య న‌గ‌రం ముస్తాబ‌వుతోంది. మే 7 నుంచి మే 31 వరకు, మొత్తం 28 రోజుల పాటు, ఈ అంతర్జాతీయ ఈవెంట్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది.   

PREV
16
Miss World 2025: మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను ఉచితంగా చూసే అవ‌కాశం.. పాస్‌లు ఎలా పొందాలంటే
miss world 2025

మిస్ వ‌ర‌ల్డ్ 2025 ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమం, గ్రాండ్ ఫినాలే — ఇవన్నీ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పోటీ కోసం 100కిపైగా దేశాల నుంచి బ్యూటీ క్వీన్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అంతర్జాతీయ కాంటెస్టెంట్ల రాకతో నగరంలో సంద‌డి నెల‌కొంది. 
 

26
miss world 2025

ఉచితంగా వీక్షించే అవ‌కాశం: 

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని ఆసక్తి ఉన్నవారి కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక కాంప్లిమెంటరీ పాస్‌లు అందిస్తోంది. వాటిని పొందాలంటే www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఎంపికైనవారికి పాస్‌లను మెయిల్ ద్వారా పంపనున్నారు. ఇది ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ ప్రత్యక్షంగా చూడటానికి అరుదైన అవకాశం కావడంతో ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

36
Miss world 2025

ఏం చేయాలంటే.. 

ఇందుకోసం ముందుగా తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంత‌రం హోమ్ పేజీపై క‌నిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. వెంట‌నే మీ ఫోన్‌లో ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన వివ‌రాల‌ను అందించి, కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఉచిత పాస్‌లు ఈమెయిల్‌కు వ‌స్తాయి. 

46
Miss world 2025

భారత్‌ మూడోసారి ఆతిథ్యం

మిస్ వరల్డ్ పోటీల 71 ఏళ్ల చరిత్రలో, భారత్ ఇప్పటివరకు రెండు సార్లు ఆతిథ్యం ఇచ్చింది — 1996లో బెంగళూరులో, 2023లో ముంబైలో. ఇప్పుడు మూడోసారి 2025లో హైదరాబాద్ ఈ ప్రతిష్టాత్మక పోటీకి వేదిక అవుతోంది. ఈ పోటీ కేవలం సౌందర్యాన్ని ప్రదర్శించేదేగాక, ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అభిప్రాయంతో మానవతా సేవ, సామాజిక బాధ్యత, మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుంది. అందుకే ఈ పోటీలో పాల్గొనేవారు స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ భాగమవుతారు.

56
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)

సీఎం సమీక్ష, పకడ్బందీ ఏర్పాట్లు

ఈ ఈవెంట్ విజయవంతంగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

 ఎయిర్‌పోర్ట్‌ నుంచి హోటళ్ల వరకు వీఐపీ వాహనాలు, వెల్కమ్ టీమ్స్, ప్రొఫెషనల్ కోఆర్డినేషన్ కల్పించాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేసేలా హోటళ్లలో వెల్కమ్ కిట్లు, ప్రత్యేక భోజన ఏర్పాట్లు, పర్సనలైజ్డ్ హాస్పిటాలిటీ ఉండేలా చూడాలని చెప్పారు.

66
Miss World Krystyna

భద్రత, మీడియా కవరేజ్‌పై ప్రత్యేక దృష్టి

విశేష భద్రత కోసం హోటళ్ల వద్ద మహిళా పోలీసు సిబ్బంది, స్పెషల్ సెక్యూరిటీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ మీడియా రిపోర్టింగ్‌ కోసం ప్రెస్ జోన్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. 

Read more Photos on
click me!

Recommended Stories