AI Park Hyderabad
హైదరాబాద్‌లో జూపార్క్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ వైల్డ్‌లైఫ్ శాంకర్చరీ ఉందని మీకు తెలుసా.? లేనిది ఉన్నట్లుగా చూపించే ఈ అద్భుత పార్క్ హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉంది. ఇంతకీ ఏంటీ పార్క్.? ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.
కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ పక్కన ఉందీ ఏఐ పార్క్. ఇందులోకి ఎంట్రన్స్ టికెట్ కేవలం రూ. 40 మాత్రమే. ఇందులో ఫారెస్ట్ వాక్, కిడ్స్ కిసాక్, వీఆర్ సెంటర్, సపారీ, వీఆర్ సఫారీ, ట్రైబల్ విలేజ్ వంటి సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత 9డీ మూవీ. ఇది మరిచిపోలేని అనుభూతిని అందిస్తోంది. సినిమా చూస్తున్నట్లు కాకుండా మీరు అక్కడే ఉన్నారన్న భావన కలగడం ఖాయం. ఈ 9డీ సినిమా 9 నిమిషాల నిడివితో ఉంటుంది. దీనికి టికెట్ రూ. 200 ఛార్జ్ చేస్తారు.
AI Park
ఇక తెలంగాణ రూరల్ కల్చర్ వీఆర్ టూర్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రియల్ టైమ్‌లో చూసిన భావన కలుగుతుంది. ఈ ఏఐ పార్కులో చెట్లు మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా వినొచ్చు. అన్నింటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం వీఆర్ జంగిల్ సఫారీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో చుట్టూ జంతువులు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి కలుగుతుంది.
Hyderabd AI park
అదే విధంగా ఈ పార్కులో కిడ్స్ ఏఆర్ లైబ్రరీ అండ్ మ్యూజిక్ ఆఫ్ ప్లాంట్స్, ఫారెస్ట్ సర్వయల్ ట్రైనింగ్‌తో పాటు వీఆర్ కయాక్, వీఆర్ ఎక్స్‌పీరియన్స్ జోన్, ఆర్బిటల్ 9డీ సినిమా, 360 ఇండోర్ థియేటర్, గార్డియనన్స్ ఆఫ్ వైల్డ్ 360 ట్రైబల్ కంటెంట్ వంటి అధునాతన టెక్నాలజీతో కూడిన థీమ్స్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్‌కి ఈ ట్రిప్ ప్లాన్ చేసి, మీ చిన్నారులకు మరిచిపోలేని అనుభూతిని అందించండి.