Hyderabad: హైదరాబాద్ లో మరో హైటెక్ సిటీ.. 450 ఎకరాల్లో ఐటీ హబ్, ఎక్క‌డంటే..

Published : Apr 18, 2025, 01:49 PM IST

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తోన్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుత హైటెక్ సిటీని పోలిన విధంగానే మ‌రో ఐటీ నాలెడ్జ్ హ‌బ్‌ను ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష నిర్వ‌హించారు.   

PREV
14
Hyderabad: హైదరాబాద్ లో మరో హైటెక్ సిటీ.. 450 ఎకరాల్లో ఐటీ హబ్, ఎక్క‌డంటే..
Hyderabad

హైద‌రాబాద్ అన‌గానే ముందుగా అక్క‌డి వార‌స‌త్వ సంప‌ద‌, 500 ఏళ్ల చ‌రిత్ర‌తో పాటు హైటెక్ సిటీ గుర్తుకురావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. దేశంలో టాప్ ఐటీ కంపెనీలున్న న‌గ‌రాల్లో ఒక‌టిగా పేరుగాంచిన హైద‌రాబాద్‌లో ఇప్పుడు మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.  ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏకంగా 450 ఎక‌రాల్లో ఐటీ నాలెడ్జ్ హ‌బ్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

24

రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌ల ప‌రిధిలోని పుప్పాలగూడ పరిసరాల్లో మొదటిదశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎస్‌ శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

34

పుప్పాలగూడ ప‌రిస‌రాల్లో ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, పలు సొసైటీలకు దాదాపు 200 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. ఇటీవల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసిందని అధికారులు తెలిపారు.

ఈ భూమి పక్కనే పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు ఉండటంతో ఇక్కడ ఐటీ నాలెడ్జి హబ్‌ అభివృద్ధి కోసం మొత్తం 450 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ భూముల‌ను ఐటీ హ‌బ్ కోసం వినియోగించుకోవాల‌ని చూస్తున్నారు. 

44
Bhatti Vikramarka

ఈ విష‌య‌మై మంత్రుల క‌మిటీ స్పందిస్తూ.. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేయడంతో.. క్రమంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులోనూ హైదరాబాద్‌ భాగస్వామిగా ఉందని, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో వేగంగా వస్తున్న మార్పులనూ హైదరాబాద్‌ ఐటీ రంగం అందిపుచ్చుకోవాలని సంకల్పించామ‌ని చెప్పుకొచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories