Hyderabad: ఐటీ, ఫార్మా మాత్ర‌మే కాదు.. మ‌రో రంగానికి హ‌బ్‌గా మారుతోన్న హైద‌రాబాద్

Published : May 08, 2025, 03:22 PM IST

హైద‌రాబాద్ అన‌గానే ముందుగా ఇక్క‌డి చారిత్ర‌క క‌ట్ట‌డాలు, 500 ఏళ్ల చ‌రిత్ర గుర్తొస్తుంది. అయితే ఆధునిక కాలంలో ఐటీ రంగం, ఫార్మా రంగాల‌కు కేరాఫ్‌గా మారింది భాగ్య న‌గ‌రం. తాజాగా ఈ జాబితాలోకి మ‌రో రంగం వ‌చ్చి చేర‌నుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న మైద‌రాబాద్ ఇప్పుడు మ‌రో రంగానికి హ‌బ్‌గా మారుతోంది.   

PREV
15
Hyderabad: ఐటీ, ఫార్మా మాత్ర‌మే కాదు.. మ‌రో రంగానికి హ‌బ్‌గా మారుతోన్న హైద‌రాబాద్
Hyderabad

హైదరాబాదు గ్లోబల్ ఏరోస్పేస్ అండ్‌ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా దూసుకెళ్తోంది. హైదరాబాద్ నగరం కొన్నేళ్ల నుంచే ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలకు వేదికగా నిలుస్తోంది. 2020–21లో ‘Aerospace Cities of the Future’ ర్యాంకింగ్‌లో ‘Cost Effectiveness’ విభాగంలో హైదరాబాదుకు మొదటి స్థానం లభించింది. ఇది నగరానికి గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తీసుకొచ్చింది.

25
Hindustan Aeronautics Limited

భౌగోళిక స్థానం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, మంచి వాతావరణం ఈ నగరాన్ని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో మరింత ముందుకు నడిపిస్తున్నాయి. T-Hub, DRDO వంటి పరిశోధనా, ఆవిష్కరణ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇవి దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఎయిర్ బ‌స్‌, బోయింగ్, మార్టిన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైద‌రాబాద్‌లో కొలువై ఉన్నాయి. 
 

35

అంతేకాకుండా స్కైరూట్ ఏరో స్పేస్‌, దృవ స్పేస్‌, అనంత్ టెక్నాల‌జీస్ వంటి ఇండియ‌న్ బేస్డ్ స్పేస్‌టెక్ సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పని చేస్తున్నాయి. ఇది భారతదేశంలో ఒక నూతన ఏరోస్పేస్ విప్లవానికి నాంది పలుకుతోంది. 
 

45

అయితే ఇంతటి సామర్థ్యం ఉన్న నగరానికి ఒక ప్రత్యేక ఏరో స్పేస్‌, డిఫెన్స్ ఇండ‌స్ట్రీయ‌ల్ కార్డిరర్‌ను నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది పరిశ్రమలను మరింత బలోపేతం చేస్తుంది, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి, దేశానికి వ్యూహాత్మకంగా బలంగా నిలబడేందుకు తోడ్పడుతుంది.
 

55

భవిష్యత్ ఏరోస్పేస్ పరిశోధనకు కేంద్రంగా మారే అవకాశం:

హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న శక్తివంతమైన పరిశోధన, ఆవిష్కరణ వేదికలు, అనుకూల వాతావరణం దీన్ని భారతదేశ భవిష్యత్తులో ఏరోస్పేస్ ఆవిష్కరణ, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, వ్యూహాత్మక పరిశోధనలో కీలక పాత్రధారిగా మార్చగలవని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories