Donald Trump: హైద‌రాబాద్‌లో ట్రంప్ వ్యాపారం చేస్తార‌ని తెలుసా? రూ. వంద‌ల కోట్లు సంపాదిస్తున్నాడు

Published : Aug 07, 2025, 02:08 PM ISTUpdated : Aug 07, 2025, 05:36 PM IST

నోరు తెరిస్తే భార‌త్‌పై విరుచుకుప‌డే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. భార‌త్‌లో మాత్రం త‌న వ్యాపారాన్ని క్ర‌మంగా విస్త‌రిస్తున్నారు. ఇంత‌కీ భార‌త్‌లో ట్రంప్ చేసే వ్యాపారం ఏంటి.? హైదరాబాద్‌తో ఉన్న సంబంధం ఏంటి? లాంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
డెడ్ ఎకాన‌మీ అంటూనే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు భారత్ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తూనే…అతని వ్యక్తిగత వ్యాపారాలు మాత్రం భారత్‌లో జోరుగా సాగిస్తున్నారు. “భారత్ ఎకానమీ డెడ్” అని అన్న‌ ట్రంప్.. అతని ట్రంప్ ఆర్గనైజేషన్‌కు మాత్రం భారత్ అత్యంత లాభదాయక మార్కెట్‌గా మారుతోంది.

DID YOU KNOW ?
కేవలం లైసెన్స్ ఫీజుల ద్వారానే
డొనాల్డ్ ట్రంప్ సంస్థ భారతదేశంలో ఎలాంటి పెట్టుబ‌డులు పెట్ట‌కుండానే కేవ‌లం లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.175 కోట్లు సంపాదించడం విశేషం.
25
లైసెన్స్ ఫీజుల రూపంలోనే

ఇండియాలోని ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులు ఇప్పటికే లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.175 కోట్లకు పైగా ఆదాయం తెచ్చాయి. ప్రస్తుతం ఉన్న 3 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని సుమారు 11 మిలియన్ చదరపు అడుగులకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది నాలుగు రెట్లు పెరుగుదలగా చెప్పవచ్చు. అమెరికా వెలుపల అత్యంత పెద్ద మార్కెట్‌ భారతే కావ‌డం గ‌మ‌నార్హం.

35
పెట్టుబడి లేకుండానే లాభాలు! ట్రంప్ మోడల్

ట్రంప్ సంస్థ భారతదేశంలో రూపాయి పెట్టుబడి లేకుండా బ్రాండ్ లైసెన్సింగ్ మోడల్ ద్వారా ఆస్తులపై హక్కు పొందుతోంది. అంటే భారతీయ డెవలపర్లు ట్రంప్ పేరును తమ ప్రాజెక్టుల్లో ఉపయోగించేందుకు ఫీజులు చెల్లిస్తున్నారు. నిర్మాణం, మార్కెటింగ్, నిర్వహణ అన్ని భారత్‌లోని కంపెనీలే చూసుకుంటున్నాయి. ట్రెబెకా డెవలపర్స్ సంస్థ (Kalpesh Mehta నేతృత్వంలో) ప్రధాన భాగస్వామిగా పనిచేస్తోంది. వారు లోధా, పంచ‌శిల్‌, , M3M, యునిమార్క్‌ లాంటి దిగ్గజ రియల్టీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

45
రూ.15,000 కోట్ల అమ్మకాల లక్ష్యం

పుణేలో మొదటి ట్రంప్ వాణిజ్య ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ట్రెబెకా వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం ఉన్న, రాబోయే ట్రంప్ ప్రాజెక్టుల ద్వారా రూ.15,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగనున్నాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కార‌ణం ఇత‌ర న‌గ‌రాల్లో కూడా కూడా ప్రాజెక్టులు ప్రారంభించ‌నున్నారు. ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు.

55
హైదరాబాద్ పై ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రత్యేక దృష్టి

భారత మార్కెట్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను ప్రాధాన్యతతో ఎంపిక చేసిన ట్రంప్ ఆర్గనైజేషన్, ఇక్కడ ప్రత్యేకంగా ఒక సంస్థను కూడా ప్రారంభించింది. 2024 అక్టోబర్ 16న "డీటీ మార్క్స్ హైదరాబాద్ ఎల్ఎల్సీ" అనే ఎంటిటీ ఏర్పాటు చేయడం ద్వారా, నగరంపై వారి వ్యూహాత్మక ఆసక్తిని వెల్లడించారు. ఇది ట్రంప్ సంస్థ ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌ను ఒక కీలక డెస్టినేషన్‌గా చూస్తోంది అన‌డానికి సంకేతం.

Read more Photos on
click me!

Recommended Stories