Hyderabad : ఓ హైదరబాదీ ఉద్యోగీ... నీ పరిస్థితి ఇంతేనా?

Published : Jul 26, 2025, 01:40 PM ISTUpdated : Jul 26, 2025, 01:46 PM IST

హైదరాబాద్ నగరంలో జీవించే ప్రతి సగటు ఉద్యోగి పరిస్థితి సేమ్ టు సేమ్… లక్షలు సంపాదిస్తున్నా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నగరాాల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి? దేనికెంత ఖర్చవుతుంది? ఇక్కడ చూద్దాం. 

PREV
15
లక్షలు సంపాదిస్తున్నా లాభమేది...

Hyderabad : ఓ జంట తమ రెండేళ్ల బిడ్డతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగులే... నెలకు రూ.80 వేల వరకు సంపాదిస్తారు. కానీ ఏం లాభం... నెల ఆరంభంలో రూ.80 బ్యాంకు అకౌంట్లో పడినా ఒకటి రెండ్రోజుల్లో మిగిలేది ఐదువేలో ఆరువేలో. అదీ ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా జాగ్రత్తపడితే. అనుకోకుండా హెల్త్ ఎమర్జెన్సీయో లేక ఇంకేదైనా ఖర్చు వచ్చిందో క్రెడిట్ కార్డు గీకాల్సిందే లేదంటే బైట అప్పు చేయాల్సిందే. ఇవీ ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో సగటు వేతనజీవి కష్టాలు.

చూసేవాళ్లకి వాళ్లకేంటి... భార్యభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు... రెండుచేతులు కాదు నాలుగుచేతుల సంపాదన... ఒకరి జీతం ఖర్చయినా ఇంకొకరి జీతం మిగులుతుందని అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ వంటి నగరాల్లో సౌకర్యవంతంగా జీవించాలంటే లక్షల జీతం కూడా సరిపోవడం లేదు. ఇంటి అద్దె లేదంటే ప్లాట్ ఈఎంఐ, పిల్లల చదువులు, కరెంట్, గ్యాస్, నెలవారి సరుకులు... వీటికే జీతం సరిపోతుంది. ఇక వెనకేసేది ఎక్కడ? అందుకే కొందరు యువకులు నగరాల్లో ఉద్యోగాలను వదిలేసి సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు... సంపాదన తక్కువే అయినా ప్రశాంతంగా జీవిస్తున్నామని చెబుతున్నారు.

హైదరాబాద్ ఓ సాధారణ వేతనజీవి ఖర్చులేలా ఉంటాయి? కుటుంబాన్ని పోషించడానికి ఎంత ఖర్చవుతుంది? సంపాదనలో ఏమయినా మిగులుతుందా? తదితర అంశాలను ఓసారి చర్చిద్దాం. వేతన జీవులు కష్టాలు తెలుసుకుందాం.

25
సగం జీతం అందుకే...

హైదరాబాద్ వంటి నగరాల్లో ఇటీవలకాలంలో జీవనవ్యయం బాగా పెరిగింది. నగరం అభివృద్ధి చెందుతున్నకొద్ది, సౌకర్యాలు పెరిగినకొద్ది ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఇలా ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ కుటుంబం (భార్యాభర్తలు, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు) ఉండాలంటే డబుల్ బెడ్రూం ఇళ్లు అవసరం... దీనికే ఓ సగటు ఉద్యోగం జీతంలో 25శాతం పోతుంది. కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో రూ.15 నుండి రూ.20 వేలవరకు డబుల్ బెడ్రూం రెంట్స్ ఉన్నాయి. అటు మణికొండ, హైటెక్ సిటీ, నానక్ రాం గూడ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అయితే ఇది రూ.30 వేల వరకు ఉంటుంది.

ఇక పిల్లల చదవు... ఇది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. నేషనల్, ఇంటర్నేషన్ స్కూల్స్ అంటూ విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి... అమాంతం ఫీజులు పెంచేస్తున్నాయి. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే ప్లేస్కూల్, డేకేర్ కే నెలకు రూ.20 నుండి రూ.30 వేలు ఖర్చవుతున్నాయి. ఇక ఉన్నత చదువులు చదివే పిల్లలుంటే ఈ ఖర్చు ఏస్థాయిలో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు... లక్షలకు లక్షలు ఖర్చవుతాయి.

35
ఒక్కరే ఉద్యోగం చేస్తే...

ఇలా భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేసి నెలకు రూ.80 వేలు సంపాదిస్తారనుకుంటే రూ.40 నుండి రూ.50 వేలు ఇంటి అద్దె, పిల్లల చదువులకే సరిపోతోంది. ఈ స్థాయిలో హైదరాబాద్ వంటి నగరాల్లో ఖర్చులు పెరిగిపోయాయి... ఇలాంటిచోట ఒక్కరు ఉద్యోగం చేస్తే వీటికే జీతమంతా ఊడ్చిపెట్టాలి... ఇక కుటుంబపోషణకు అప్పో సొప్పో చేయాలి.

45
హైదరాబాద్ లో వేతనజీవి ఖర్చులు

ఇంటి అద్దె, పిల్లల చదువులకు సగం జీతం వెళ్లిపోతుంది. మిగతాసగంతో నెలంతా నెట్టుకురావాలి. ఇందులోనూ ఎక్కువశాతం నెల ఆరంభంలోనే ఖర్చయిపోతాయి.

ఇంట్లోకి నెలనెలా రైస్, వంటలకు, ఇంట్లో ఉపయోగించేందుకు అవసరమైన సరుకులు తేవాలి. కూరగాయలకు సెపరేట్ ఖర్చు. పిల్లలుంటారు కాబట్టి పండ్లు, పాలు, ఇతర చిరుతిళ్లు తప్పనిసరి. వీటన్నింటికి నెలకు ఎంత తక్కువ అనుకున్నా రూ.10000 ఖర్చవుతుంది.

భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే బైక్, ఆటో, బస్సు లేదంటే మెట్రో వంటివాటిలో రోజు ప్రయాణించాల్సిందే. పెట్రోల్, రవాణా ఖర్చులు మరో ఐదారువేలు అవుతాయి. ఆఫీసులో సహోద్యోగులు, బయట స్నేహితులు పార్టీలంటే దీనికి ఎంత తక్కువ అనుకున్నా రెండుమూడు వేలు అవుతాయి.

కరెంట్, వాటర్, వైఫై... ఇలా నెలనెలా కట్టాల్సిన బిల్లలు ఉండనే ఉంటాయి. వీటికి రూ.3 నుండి రూ.4 వేలు వేసుకొండి. నెలలో కనీసం ఒక్కసారి భార్యాపిల్లలతో అలా బైటికి వెళితే వెయ్యి రెండువేలు ఖర్చవడం ఖాయం. హైదరాబాద్ వంటి నగరాల్లో గాలి తప్ప ఏదీ డబ్బులు లేకుండా రాదు... స్వచ్చమైన గాలి కావాలన్నా టికెట్ తీసుకుని ఏ పార్కుకో వెళ్లాలి. ఒక్కోసారి అదీ ఖర్చే.

55
సడన్ ఖర్చులు వచ్చాయా.. అప్పులే దిక్కు

భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా... నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నా వెనకేసుకునేది ఏమి ఉండటంలేదు. అన్ని ఖర్చులకే వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సడన్ గా హాస్పిటల్ వంటి ఖర్చులు వచ్చాయో.... క్రెడిట్ కార్డులు గీకాల్సిందే, అంటే అప్పు చేయాల్సిందే. లక్షలు సంపాదించినా లాస్ట్ కి అప్పుల అప్పారావు బ్రతుకు అయిపోతోంది హైదరాబాద్ లో ఓ సగటు ఉద్యోగి పరిస్థితి.

అయితే ప్రస్తుతం పేరెంటింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. తమ పిల్లలు అడిగారంటే, వారికి అవసరం అనుకుంటే ఎంతయినా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. వారిని లక్షల ఫీజులు కట్టి చదివిస్తూ లగ్జరీగా పెంచాలనుకుంటున్నారు. అందుకే రూపాయి మిగలకుండా ఖర్చు చేసినా ఇది తమ పిల్లల భవిష్యత్ కోసమేనని సరిపెట్టుకుంటున్నారు.

పేరెంట్ మైండ్ సెట్ కారణంగానే హైదరబాదీ వేతన జీవి కష్టాలు బయటకు రావడం లేదు... బయటనుండి చూసేవారికి ఇది లగ్జరీ జీవితంలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జీవించేవారికే తెలుస్తుంది ఇది లగ్జరీ కాదు సర్దుకుపోయి బ్రతకడం అని.

Read more Photos on
click me!

Recommended Stories