Health Tips: మీ నాలుక రంగు మారుతుందా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Published : Jun 26, 2023, 10:43 AM IST

 Health Tips: నాలుక రంగు బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. అందుకే వైద్యులు ముందుగా నాలుకనే పరీక్షించి సమస్య ఏంటో చెబుతారు. మరి ఆ సమస్యలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.  

PREV
16
Health Tips: మీ నాలుక రంగు మారుతుందా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

పూర్వకాలంలో వైద్యులు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన నాడి చూసి తర్వాత మన నాలుక చూసి ఏం జబ్బులు ఉన్నాయో టక్కున చెప్పేవారు. ఇప్పుడు కూడా చాలామంది డాక్టర్ లు మన నాలుకను చూసి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు.

26

వాళ్లు నాలుకను చూసి అలా ఎలా చెప్పేస్తున్నారు మనకి అర్థం కాదు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే మనం కూడా మన నాలుకను బట్టి ఆరోగ్యాన్ని కొంతలో కొంత అంచనా వేయవచ్చు. అది ఎలాగో చూద్దాం రండి. నాలుక లైట్ పింక్ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.

36

దానిపై కొద్దిగా తెల్లని కోటింగ్ లా కనిపించినా నార్మల్గానే ఉన్నట్టు లెక్క. అదే నాలుక తెలుపు రంగులో ఉంటే నోట్లో శుభ్రంగా లేదని నోటి సుభ్రతను పాటించడం లేదని అర్థం. శరీరం డిహైడ్రేషన్కు గురైన నాలుక ఇలాగే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్లూ ఉన్నా కూడా నాలుక ఇలాగే కనిపిస్తుంది.
 

46

మీ నాలుక పసుపు రంగులో కనిపిస్తుందంటే మీ ఒంట్లో పోషకాల లోపం ఉందని అర్థం. కొందరికి నాలుక నల్లగా మచ్చలుగా కనిపిస్తుంది ఇది ఎక్కువగా క్యాన్సర్ రోగుల్లోనూ కీమోథెరపీ చేయించుకున్న వారిలోనూ కనిపిస్తుంది.

56

అలాగే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు నోటి లైకెల్ ప్లానస్కు కారణం అవుతుంది. ఇది నోటిలోని శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. దానివలన నాలుకపై తెల్లని మచ్చలు నాలుక దెబ్బ తినడం జరుగుతుంది. నాలుకపై మ్యాపు లాంటి నమూనాలు కనిపిస్తే అలర్జీలు, మధుమేహము, ఒత్తిడి ఉన్నట్లు గమనించాలి.
 

66

పిల్లలకు సాధారణంగా అధిక జ్వరము రక్తనాళాల వాపు వల్ల నాలుక ఎర్రగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరియైన పోషకాహారం తీసుకోకపోవడం. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యని అధిగమించవచ్చు.

click me!

Recommended Stories