world heart day 2023: ఒకప్పటి జీవన శైలికి ఇప్పటి జీవన శైలికి ఎంతో తేడా ఉంది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీనిమూలంగానే ప్రస్తుతం ఎన్నో రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కేవలం పెద్దలే కాదు పిల్లలు కూడా ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా గత కొంత గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, నిలబడి ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్న ఘటనలను నిత్యం మనం వార్తల్లో చూస్తేనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో పిల్లలను గుండెజబ్బులు, గుండెపోటు నుంచి రక్షించడానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.