నిద్రపోతున్నప్పుడు కూడా గుండెపోటు వస్తది.. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

First Published | Sep 29, 2023, 11:46 AM IST

world heart day 2023: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మన గుండె పదిలంగా ఉండాలి. మన శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైన అవయవం. గుండె మన శరీరమంతా రక్తాన్ని అందించడానికి పని చేస్తుంది. అందుకే దీన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. 
 

world heart day 2023: ఒకప్పుడు గుండెపోటు రావడం చాలా అరుదు. అది కూడా వయసు మీద పడ్డవారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతిఒక్కరికీ వస్తోంది ఈ రోగం. దీని మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి హార్ట్ ఎటాకే కారణమని సర్వేలు పేర్కొంటున్నారు. మారుతున్న జీవిన శైలి, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల ఇలా గుండె జబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మన గుండె ఫిట్ గా ఉండాలి. గుండె మన శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండెకు ఎలాంటి సమస్యలుండొద్దు. 
 

ఏటా ఎంతో మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. దీనిపై జనాలకు అవగాహన లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమే. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా కాలం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు నమోదవుతున్నాయి.

Latest Videos



యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు

ఒకప్పుడు ఈ గుండె సంబంధిత వ్యాధులు పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు పిల్లలు, యువకులకు కూడా ఈ వ్యాధి వస్తోంది. డ్యాన్స్ చేస్తూ.. గేమ్స్ ఆడుతూ, వ్యాయామం చేస్తూ ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలిన ఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. గుండెపోటుకు గురయ్యే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి. అంతేకాదు నిద్రపోతున్న వ్యక్తులు కూడా గుండెపోటుతో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దీనికి కారణాలేంటి? నివారణా చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నిద్రపోతున్నప్పుడు గుండెపోటు ఎందుకు వస్తుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం  ప్రకారం.. నిద్రపోతున్నప్పుడు గుండెపోటు రావడానికి ప్రధాన కారణం.. గుండె ప్రధాన సిరలలో ఒకటి పూర్తి బ్లాక్ కావడం. లేదా దానిలో ఏదైనా అడ్డంకి కావొచ్చు. ఈ అడ్డంకికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోవడం. ఇక రెండోది రక్తం గడ్డకట్టడం. ఇది తాత్కాలికంగా సంభవిస్తుంది. కానీ కొలెస్ట్రాల్ ఎప్పటినుంచో ఉంటుంది. సాధారణంగా గుండెపోటు రెండో కారణమైన రక్తం గడ్డకట్టడం వల్ల ఏ సమయంలోనైనా రావొచ్చు. 

heart attack

గుండెపోటుకు ప్రధాన కారణాలు

చురుగ్గా ఉన్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు మాత్రమే గుండెపోటు వచ్చే అవకాశం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రపోతున్నప్పుడు కూడా రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది. అలాగే ఇతర కార్యకలాపాలు చేసేటప్పుడు కూడా గుండెపోటు బారిన పడొచ్చు. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Heart Attack

గుండెపోటుకు ప్రధాన కారణాలు

అధిక రక్తపోటు 

కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం

అధిక చక్కెర స్థాయిలు

శారీరక శ్రమ లేకపోవడం
అధిక బరువు 

ఎప్పుడూ ఒత్తిడికి లోనవడం

Image: Getty

అయితే గుండెపోటుకు దారితీసే ఈ కారణాలన్నింటినీ చాలా వరకు నియంత్రించవచ్చని డాక్టర్లు అంటున్నారు. అయితే గుండెపోటు రావడానికి ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని మాత్రం నియంత్రించలేం. 

వృద్ధాప్యం
లింగ ఆధారిత (ఆడవారి కంటే మగవారికే ఎక్కువగా గుండెపోటు వస్తుంది)
వంశపారంపర్యం
 

heart attack

గుండెపోటు లక్షణాలు

హార్ట్ ఎటాక్ వస్తే ఛాతీ లో విపరీతమైన నొప్పి పుడుతుంది. ఈ నొప్పి ఎడమ ఛాతీ వైపు మాత్రమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ గుండెపోటు నొప్పి ఛాతీలోనే కాదు మన దవడ నుంచి నాభి వరకు ఎక్కడైనా రావొచ్చు. కాగా ఈ నొప్పి అక్కడే కాకుండా మన భుజాలు, చేతులు, ఎగువ వీపు వరకు పాకుతుంది. 
 

Heart Attack


గుండెపోటుకు సాధారణ లక్షణాలు 

ఛాతీ నొప్పి
శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
ఆందోళన
హృదయ స్పందన పెరగడం
మూర్ఛ
మాట్లాడటంలో ఇబ్బంది
విపరీతంగా చెమటలు పట్టడం

heart attack


గుండెపోటు నివారణ చిట్కాలు 

బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి
ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి
క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు చేయించుకోవాలి 
తీయని లేదా వేయించిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు
స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి. 
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. 
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్  టెస్టులు చేయించుకోవాలి. 

click me!