Health Tips: బాలింతలు ఈ ఆహారం తీసుకోకూడదు.. లేదంటే బిడ్డకు ప్రమాదమే!

First Published | Sep 5, 2023, 1:10 PM IST

Health Tips: ప్రసవానంతరం తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నేటి తరం మహిళలకు పూర్తిగా అవగాహన లేని విషయం. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. కాబట్టి బాలింతలు తీసుకునే ఆహారం మీద అవగాహన పెంచుకుందాం.
 

 పూర్వం ప్రసవాలు జరిగే సమయంలో ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉండేవారు కాబట్టి బాలింతల  ఆహారం విషయంలో తగినంత అవగాహన, శ్రద్ధ కలిగి ఉండేవారు. నేడు అలాంటి పరిస్థితులు కరువైనందున కొత్తగా తల్లులు అయిన బాలింతలకు ఈ విషయంపై కొద్దిగా అవగాహన తక్కువనే చెప్పాలి.
 

ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం మీదే బిడ్డ యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ముందు చూద్దాం. ముఖ్యంగా చల్లని పదార్థాలు తీసుకోకూడదు. బిడ్డ మీ దగ్గర పాలు తాగుతాడు కాబట్టి అతనికి జలుబు, పడిశం లాంటివి వస్తాయి.
 

Latest Videos


అలాగే గేదినెయ్యి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇది తీసుకోవటం వలన బిడ్డకి వేడి చేస్తుంది. అలాగే కొత్త బియ్యంతో వండిన అన్నం తినకూడదు. ముఖ్యంగా చద్దన్నం అస్సలు తినకూడదు. పచ్చి చేపలతో వండిన ఏ కూర కూడా బాలింతరాలు తినకూడదు.
 

 కొత్త చింతపండుతో చేసిన వంటకాలు గానీ పులుసు కూరలు గాని తినకూడదు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన బాలింతకు సుతికా వ్యాధులు వస్తాయి. అలాగే బలమైన కూరలు తినటం వలన బిడ్డకి అరుగుదల లోపం ఏర్పడుతుంది. ఫలితంగా బిడ్డకి కడుపు ఉబ్బరం వస్తుంది.
 

అలాగే బాలింతలు కందికట్టు, ధనియాల పొడి, సొంఠి పొడి, నువ్వుల పొడి, వెల్లుల్లిపాయ కారం, పాత బెల్లం, ఉసిరికాయ పచ్చడి, పాత నిమ్మకాయ పచ్చడి వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే బీరకాయ కూర కందకూర తరచూ తింటూ ఉండాలి. అలాగే పాలు ఎక్కువగా పడటం కోసం పచ్చి బొప్పాయి కూర, తెలగపిండి కూర అలాగే మాంసాహారులైతే ఎండు నత్తళ్ళ కూర  తినాలి.
 

అలాగే రాత్రిపూట కచ్చితంగా  పాలు తాగాలి. ప్రసరించిన 15 రోజుల వరకు ఒంటి పూట భోజనం చేయడం చాలా ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. టీ,కాఫీ అలవాటు ఉన్నవారు బెల్లంతో చేసిన టీ, కాఫీలు సేవించటం ఉత్తమం. బిడ్డ మీ దగ్గర పాలు తాగుతున్నంతకాలం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బిడ్డకి అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన తల్లులు అవుతారు.

click me!