ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ ఎ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.