మన దినచర్యలో పళ్లను తోముకోవడం ఒక భాగం. పళ్లను తోముకోవడం వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. దంతాలు, నోరు క్లీన్ అవుతాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముతున్నప్పుడు వికారంగా అనిపించడం, వాంతులు అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం పదండి.
పిత్తం సమస్య
పళ్లో తోమేటప్పుడు వాంతులు అవడం, వికారంగా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో శరీరంలో పిత్తం పెరగడం ఒకటి. అవును శరీరంలో పిత్తం పెరిగితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇది మీరు పళ్లు తోముకునేటప్పుడు వాంతులకు కారణమవుతుంది.
అల్సర్
చాలా మందికి అల్సర్ సమస్య ఉంటుంది. కానీ దీన్ని అంతగా పట్టించుకోరు. అదే తగ్గుతుందిలే అని లైట్ తీసుకుంటారు. అయితే ఎవరికైతే అల్సర్ సమస్య ఉంటుందో వారికి పళ్లను తోముకునేటప్పుడు వాంతులు అవుతాయి. వికారంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాలేయ వ్యాధి
కాలెయ సంబంధిత వ్యాధులను తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత రిస్క్ లో పడేస్తుంది. అయితే కాలేయ సంబంధిత వ్యాధులు ఉంటే కూడా పళ్లు తోముకునేటప్పుడు వాంతులు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
brushing
మూత్రపిండాల వ్యాధి
ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే మన శరీరంలో మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల దంతాలు బ్రష్ చేసేటప్పుడు వికారంగా ఉంటుంది. వాంతులు అవుతాయి. అందుకే పళ్లు తోమేటప్పుడు వికారంగా అనిపించినా, వాంతులు అయినా లేట్ చేయకుండా హస్పటల్ కు చూపించుకోండి.