మందార పువ్వులను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published May 9, 2024, 1:31 PM IST

మందార పువ్వులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. నిజానికి ఈ పువ్వులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును ఈ పువ్వులను తినడం వల్ల మనం ఎన్నో అనారోగ్యసమస్యలకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

hibiscus

మందార పువ్వుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక మందార పువ్వును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అసలు మందార పువ్వును తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మందారం పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువులను నాశనం చేస్తాయి. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల రిస్క్ న తగ్గిస్తుంది. 
 

hibiscus flower

బరువు తగ్గుతారు

మందార పువ్వులు కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. అవును మందార పువ్వు టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది.  దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

hibiscus flower

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. 

మందార పువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇది జీవక్రియను పెంచుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. 

hibiscus flower

కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

మందార పువ్వులు కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పువ్వులు కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇది టాక్సిన్స్ ను విడుదల చేసి కాలేయం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

hibiscus flower

రక్త నష్టాన్ని తొలగిస్తుంది

మందార  పువ్వులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త లోపాన్ని తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఒక పువ్వు తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. 

చర్మానికి మేలు

మందార పువ్వులు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు మందార పువ్వులు ముఖంపై మచ్చలను కూడా పోగొడుతుంది. 
 

రక్తపోటును నియంత్రిస్తుంది

అధిక రక్తపోటు పేషెంట్లకు కూడా మందార పువ్వులు మంచి మేలు చేస్తాయి. నిజానికి బీపీ పేషెంట్లకు ఈ మందార పువ్వులు ఒక వరం లాంటివి. ఈ పూలతో చేసిన టీ తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
 

click me!