డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు ది కీలకపాత్ర అని చెప్పవచ్చు. వీటిలో ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు, విటమిన్ ఈ, క్యాల్షియం, జింక్,ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.