Health Tips: క్యాబేజీ నీరు యొక్క అద్భుత గుణాలు.. నిజంగా మీ ఆరోగ్యానికి సంజీవని!

Navya G | Published : Sep 6, 2023 12:19 PM
Google News Follow Us

Health Tips: క్యాబేజీని కూరగాయగాను,సలాడ్ల రూపంలోనూ తీసుకుంటూ ఉంటాము. అయితే చాలామంది దీనిని తినటానికి అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీ లోను, దాని  నీరులోను ఉండే అద్భుత గుణాల గురించి తెలుసుకుంటే  ఈ కాయగూరని అస్సలు వదిలిపెట్టరు. ఆ గుణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
 

16
Health Tips: క్యాబేజీ నీరు యొక్క అద్భుత గుణాలు.. నిజంగా మీ ఆరోగ్యానికి సంజీవని!

 కాయగూరలలో క్యాబేజీ అతి శ్రేష్టమైనది. అయితే చాల మంది క్యాబేజీ నుంచి వచ్చే వాసన నచ్చక తినటానికి ఇష్టపడరు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. క్యాబేజీని తినటం పక్కన పెడితే క్యాబేజీని ఉడకబెట్టుకొని ఆ నీటిని తాగినా చాలు అనేక పోషకాలు శరీరానికి అందుతాయి.
 

26

 మీరు క్యాబేజీ తినకపోయినట్లయితే ఎన్నో పోషకాలని కోల్పోయినట్లే. క్యాబేజీ నీరు తాగటం వలన కలిగే లాభాలని ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ ని నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు నిరూపించారు.
 

36

 క్యాబేజీ నీటి ద్వారా శరీరానికి అవసరమైన ప్లేవనాయిడ్స్  సమృద్ధిగా అందుతాయి. అధికంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు కలిగిన క్యాబేజీ నీరు తాగటం వల్ల ఎముకలకు బలం చేకూరి దృఢంగా మారుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనత కూడా బాగా తగ్గిస్తుంది.
 

Related Articles

46

 అలాగే శరీరంలో అధిక కొవ్వుని కరిగించడంతోపాటు అధిక బరువును కూడా తగ్గించడానికి క్యాబేజీ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ నీటిని రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది.
 

56

అల్సర్ తో బాధపడేవాళ్లు ఈ నీరు తాగితే జీర్ణాశయంలో, పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మృదువుగా మారడమే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలు కూడా నివారించబడతాయి. అలాగే దృష్టి సమస్యలు తీరి కంటి చూపు మెరుగుపడుతుంది. ఆల్కహాల్ సేవించడం వలన కలిగే దుష్పరిణామాలను ఈ నీరు తగ్గిస్తుంది.

66

 శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను తొలగించే లివర్ ని శుభ్రం చేస్తుంది. అలాగే లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాబేజీ లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అవి ఎముకలు బలహీన పడకుండా దృఢంగా ఉంచుతాయి. కాబట్టి ప్రతిరోజు ఈ అద్భుతమైన నీటిని తాగటానికి ప్రయత్నించండి.

Recommended Photos