పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు

Published : Sep 06, 2023, 01:01 PM IST

పంటినొప్పి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల సరిగ్గా నిద్రకూడా రాదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పంటి నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..?  

PREV
15
పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు

మన దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో పంటి నొప్పి ఒకటి. కొంతమందికి తరచుగా పంటి నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు వీలైనంత తొందరగా డాక్టర్ కు చూపించుకోవాలి. అయితే ఈ పంటి నొప్పి అంత ప్రమాదకరమైంది కాదు. అయితే ఇంటి చిట్కాలతో కూడా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగా ఇప్పుడు తెలుసుకుందాం..
 

25

ఉసిరికాయ 

అనేక ఔషధ గుణాలున్న వాటిలో ఉసిరికాయ ఒకటి. పంటినొప్పిని నివారించడానికి కూడా ఉసిరికాయ బాగా ఉపయోగపడుతుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉసిరి మందులా పనిచేయదు. కానీ దీనిని దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే ఈ నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఉసిరి పొడిని రోజూ 1 టీస్పూన్ చొప్పున తీసుకోవాలి.
 

35
Image: Getty Images

లవంగాలు

పంటి నొప్పిని తగ్గించుకోవడానికి  లవంగాలను విరివిగా ఉపయోగిస్తారు. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తక్షణమే ఉపయోగించే వాటిలో లవంగాలు ఒకటి. దీన్ని కూడా వాడుకోవచ్చు. పంటినొప్పి తగ్గాలంటే లవంగాలను నోట్లో వేసుకుని నమలితే చాలు. దాని రసం నొప్పి ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి. అంతే.
 

45

వీట్ గ్రాస్

ఈ రోజు చాలా మంది తమ ఇళ్లలో వీట్ గ్రాస్ ను పండిస్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుంది. దీన్ని కూడా నోట్లో వేసుకుని నమలితే ఉపశమనం పొందొచ్చు.

 

55

పసుపు

ఆయుర్వేదం ప్రకారం.. పసుపు చాలా ఔషధ లక్షణాలను కలిగి ఉన్న మరొక సమ్మేళనం. పంటి నొప్పికి నివారణగా కూడా దీన్ని ఉపయోగించొచ్చు. కొద్దిగా ఆవనూనెలో మెత్తగా పొడి చేసిన పసుపును మిక్స్ చేసి, ఆ పేస్ట్ లా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి.

Read more Photos on
click me!

Recommended Stories