నొప్పినుంచి ఉపశమనానికి కాపడం పెడుతున్నారా?.. అయితే ఇది మీకు తెలియాల్సిందే...

Published : Jun 08, 2021, 01:08 PM IST

నొప్పినుంచి ఉపశమనానికి కాపడం పెట్టడం అందరికీ తెలిసిందే. నొప్పిని బట్టి ఐస్ తోనా, వేడితోనా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఏ నొప్పికి ఏ కాపడం మంచిది.. ఎలాంటి సందర్బాల్లో, ఏ కాపడం మంచిదో తెలిస్తే నొప్పి నుంచి ఈజీగా బయటపడొచ్చు. 

PREV
113

213

వీటినే ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ లు అని పిలుస్తారు. వీటివల్ల శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి. నొప్పి మీద అవి ఎలా పనిచేస్తాయి? అనే విషయం తెలిసి ఉంటే.. మీకు వచ్చిన నొప్పి ఏంటీ, దానికి ఎలాంటి కాపడం పెట్టాలనేది మీకే తెలిసిపోతుంది. 

313

ఐస్ ప్యాక్  : దెబ్బ తగలగానే వెంటనే ఐస్ పెట్టమని పెద్దల నుంచి డాక్టర్ల వరకు ఇదేమాట చెబుతుంటారు. ఎందుకో తెలుసా.. ఐస్ వల్ల గాయం తాలూకు నొప్పి తగ్గుతుంది. తాజా గాయాలైతే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. 

413

దెబ్బ తగిలి అది చిట్లిపోయి తెరుచుకోకుండా ఉంటే.. ఆ ప్రాంతం చుట్టూ వాపు, ఎరుపు వస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతం వేడిగా ఉంటుంది. అక్కడ ఐస్ పెట్టినప్పుడు వేడివల్ల వ్యాకోచించిన లోపలి రక్త నాళాలు సంకోచించడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఆ తరువాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి.

513

ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్‌–హంటింగ్‌ చర్య’ అంటారు. దీని వల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ ఒక్కసారిగా రక్తంలో కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి రక్తనాళాల వ్యాకోచం, రక్తప్రసరణ ఎక్కువగా తోడ్పడతాయి. 

613

అంతేకాదు... ఐస్‌ పెట్టడం వల్ల కోల్డ్‌ రిసెప్టార్స్‌ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్‌ అనే స్టిమ్యులెంట్స్‌  విడుదలవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్‌ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. 

713

అయితే ఈ ఐస్ ప్యాక్ ఎలా పెట్టాలి. ఎంత సేపు పెట్టాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఏదో పైపైన రుద్దేయడం కాకుండా.. ఐస్‌ ప్యాక్‌ కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్‌ క్యూబ్స్‌ను టవల్‌లోగాని, లేదా ఏదైనా కవర్‌లోగాని పెట్టి ఐస్‌ప్యాక్‌ పెట్టవచ్చు. అలాగే జెల్‌ప్యాక్స్‌ రూపంలోనూ వాడవచ్చు. 

813

ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు, వాపు, మంట వచ్చిన చోట, తాజా గాయాలు అయినప్పుడు. ఓపెన్‌ ఇంజ్యురీ కానప్పుడు ఐస్‌ కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది. 

913

అలాగే వేడి కాపడం దీర్ఘకాలిక నొప్పుల్లో బాగా పనికివస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు కూడా ఈ వేడికాపడం ఉపశమనం కలిగిస్తుంది. మహిళలకు నెలసరి సమయాల్లో నడుము వద్ద నొప్పి వస్తున్నప్పుడు వేడికాపడంతో ఒకింత ఉపశమనం కలుగుతుంది. 

1013

అంతేకాదు వేడికాపడం తాలూకు ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ఉంటుంది. దీనివల్ల గాయమైన చోట వేడికాపడం పెట్టగానే ఆ పరిసరాల్లో రక్తప్రసరణ ఎక్కువవుతుంది. దాంతో అక్కడ మెటబాలిక్‌ రేట్‌ కూడా పెరుగుతుంది. నరాలూ ఉత్తేజితమవుతాయి. 

1113

కాబట్టి ఆ ప్రాంతంలో పట్టే చెమటలో మలినాలు విసర్జితమవుతాయి. దీనివల్ల కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దికొద్దిగా వేడి కాపడం పెడుతూ,  కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. మృదువైన బట్టను వేడినీళ్లలో ఉంచి, పిండి అద్దడం ద్వారా వేడికాపడం పెట్టవచ్చు. 

1213

అయితే ఇటీవల మెడికల్‌ షాపుల్లో హాట్‌ వాటర్‌ బ్యాగ్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. ఆ బ్యాగులలో వేడి చేసిన నీటిని నింపి వేడికాపడం పెట్టవచ్చు. ఇవేగాక ఇప్పుడు ఎలక్ట్రిక్‌ హీట్‌ ప్యాక్‌గాని, వ్యాక్స్‌తో గాని వేడికాపడం పెట్టే సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి.  

1313

ఇక వేడి కాపడం నడుమునొప్పి, ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి, మెకానికల్‌ బ్యాక్‌పెయిన్‌, డిస్క్‌ పొలాప్స్‌, సయాటికా, నెలసరి నొప్పి వంటి వాటికి మంచి ఉపశమనంగా ఉంటుంది.

click me!

Recommended Stories