దాహం తీరడం లేదని.. నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..?

First Published Jun 3, 2021, 2:13 PM IST

పనిలో లేదా ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు, మామూలు కంటే ఎక్కువ నీరు అవసరం. అలా కాకుండా  తరచు నీరు తాగుతున్నా కూడా దాహం వేస్తోంది అంటే మాత్రం.. ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లే అర్థం. దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం...

ఎండాకాలం వచ్చిందంటే చాలు దాహనం ఎక్కువగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. నీళ్లు తాగినా కూడా దాహం తీరడం లేదు అంటే.. మాత్రం ఏదో అనారోగ్యం రాబోతోందని సంకేతమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజనుకి రెండు నుంచి 3 లీటర్ల నీరు సరిపోతుందట. అలా కాకుండా నీరు ఎక్కువ తాగినా.. తక్కువ తాగినా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
పనిలో లేదా ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు, మామూలు కంటే ఎక్కువ నీరు అవసరం. అలా కాకుండా తరచు నీరు తాగుతున్నా కూడా దాహం వేస్తోంది అంటే మాత్రం.. ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లే అర్థం. దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం...
undefined
అధిక దాహం వేస్తోంది అంటే 'పాలిడిప్సియా'ఎంత నీరు తాగినా తాహం తీరకపోవడాన్ని వైద్య పదంలో 'పాలిడిప్సియా' అంటారు. ఈ వ్యాధి సోకిన వారు నీరు తాగుతూనే ఉంటారు.
undefined
ఎక్కువగా నీరు తాగేవారిలో సోడియం లోపం ఏర్పడుతుంది.అంతేకాకుండా.. కడుపులో వికారంగా ఉండటం.. వాంతులు అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా.. మూత్ర విసర్జన కూడా ఎక్కువ సార్లు చేస్తారు.
undefined
నీరు తాగకపోవడం వల్ల ... శరీరం డీ హైడ్రేట్ అవుతోందని అర్థం. శరీరంలో నీరు తక్కువగా ఉండటాన్ని డీ హైడ్రేషన్ అంటారు. ఇది ఫుడ్ పాయిజినింగ్, డయేరియా, జ్వరం లాంటి కారణాలకు దారితీస్తుంది.
undefined
నోరు అంతా ఎండిపోయినట్లుగా అవుతుంది. చాలా నీరసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో సరిపడా మంచినీరు తాగాలి. అప్పుడు శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.
undefined
ఇక డయాబెటిక్స్ వ్యాధితో బాధపడేవారు కూడా ఎక్కువగా దాహానికి గురౌతూ ఉంటారు. నీరు తాగినా దాహం తీరదు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోవడం వల్ల శరీరంలో నీరు శాతం తగ్గుతుంది. అందుకే పదే పదే మంచినీరు తాగాలనే కోరిక కలుగుతుంది.
undefined
మరి అతి దాహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే.. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. దానివల్ల పొట్ట నిండిపోతుంది. కాబట్టి.. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగితే సరిపోతుంది.
undefined
లేదంటే.. ఉసిరి పౌడర్, తేనే కలిపి తీసుకోవాలి. ఇది అధిక దాహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా సమస్య ఎక్కువగా ఉంది అంటే.. వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
undefined
click me!