చలికాలంలో వెల్లుల్లిని తింటున్నారా అయితే ఏం జరుగుతుందో చుడండి!

Navya G   | Asianet News
Published : Dec 11, 2021, 08:22 PM IST

వెల్లుల్లి (Garlic) వంటింటి మసాలాలలో అందుబాటులో ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.  అయితే ఈ వెల్లుల్లిని ముఖ్యంగా చలికాలంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది కలిగించే శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. వెల్లుల్లి శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇతర రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. నిత్యం ఏదో ఒక రూపంలో వెల్లుల్లిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే వెల్లుల్లి ఏ విధంగా శరీరానికి చలికాలంలో (Winter) మేలు చేస్తుందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..  

PREV
17
చలికాలంలో వెల్లుల్లిని తింటున్నారా అయితే ఏం జరుగుతుందో చుడండి!

వెల్లుల్లిలో క్యాల్షియం (Calcium), మెగ్నీషియం (Magnesium), ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, కోలిన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలతో పాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వెల్లుల్లి శరీరానికి ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

27
Garlic

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: వెల్లుల్లిలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు (Proteins) శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. చలికాలంలో చల్లటి ఉష్ణోగ్రతలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. అలాంటప్పుడు వెల్లుల్లిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది.

37

జలుబు, దగ్గును తగ్గిస్తుంది: వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ వైరల్(Antiviral), యాంటీ మైక్రోబయల్ (Anti Microbial) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే దగ్గు జలుబులను తగ్గిస్తుంది.
 

47
garlic

శరీరంలో వేడిని పెంచుతుంది: వెల్లుల్లిలోని పోషకాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలోను (Purifying the blood), రక్త ఉత్పత్తిని (Blood production) మెరుగుపరచడం లోనూ చక్కగా సహాయపడతాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి వేడిని పెంచడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి.

57

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: శరీరంలో అధిక శాతం కొలెస్ట్రాల్ (Cholesterol) ఉంటే అనేక గుండె సమస్యలు (Heart problems) వస్తాయి. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
 

67

జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది: చలికాలంలో చల్లని ఉష్ణోగ్రతల (Cold temperatures) కారణంగా జీర్ణాశయ వ్యవస్థ (Digestive system) తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆలస్యం చేస్తుంది. అయితే వెల్లుల్లిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 

77

అలర్జీలను తగ్గిస్తుంది: శీతాకాలంలో గాలిలోని చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా శరీరం అనేక అలర్జీలను (Allergies) ఎదుర్కొంటుంది. వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచి అర్జీలను తగ్గిస్తుంది.

click me!

Recommended Stories