చాయ్ తాగిన తర్వాత నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Jul 4, 2024, 9:41 AM IST

కొంతమంది పరిగడుపునే టీ తాగితే మరికొంతమంది మాత్రం ముందు నీళ్లు తాగి ఆ తర్వాత టీ తాగుతుంటారు. ఇంకొంతమంది టీ తాగిన తర్వాత నీళ్లు తాగుతుంటారు. కానీ టీ తాగిన తర్వాత నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Stop drinking milk tea

టీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చాలా మంది ఉదయం టీ తాగిన తర్వాత పనులను మొదలుపెడతారు. అయితే కొంతమంది నీళ్లు తాగిన తర్వాత టీ తాగితే.. మరికొంతమంది మాత్రం టీ తాగిన తర్వాత నీళ్లను తాగుతుంటారు. ముందు నీళ్లు తాగినా.. చాలా మందికి ఛాయ్ తాగిన తర్వాత ఖచ్చితంగా దాహంగా అనిపిస్తుంది. ఇంకేముందు నీళ్లను బాగా తాగుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు ఇంట్లో పెద్దలు కూడా ఛాయ్ తాగిన తర్వాత నీళ్లను తాగకూడదని కూడా మనకు చెప్తుంటారు. అసలు ఇలా ఎందుకు తాగకూడదంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

water

టీ తాగిన తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదు?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే మన దంతాలు పసుపు రంగులోకి మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా మీరు ప్రతిరోజూ చేస్తే మీ దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇది పయోరియా వంటి దంతాలలో ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. 


అలాగే వేడి వేడి ఛాయ్ ని తాగిన తర్వాత చల్లటి నీళ్లను తాగడం వల్ల నోటి ఉష్ణోగ్రత మారుతుంది. దీంతో దంతాల నరాలు దెబ్బతింటాయి. అలాగే దంతాల పై పొర అయిన ఎనామిల్ కూడా బాగా దెబ్బతింటుంది. దీంతో మీకు దంతాల సున్నితత్వం పెరుగుతుంది.
 

వేడి వేడి టీ తాగిన తర్వాత చల్లని నీళ్లను తాగడం వల్ల కోల్డ్ హీట్ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒక్కోసారి దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మీ గొంతు కూడా ఉబ్బుతుంది.

టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో మీకు విరేచనాలు కూడా అవ్వొచ్చు. అలాగే గ్యాస్, ఎసిడిటీ, టోర్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే టీ తాగిన తర్వాత నీళ్లను పొరపాటున కూడా తాగకూడదు. నీళ్లను టీ తాగడానికంటే ముందే తాగాలి. 

click me!