రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 30, 2024, 3:58 PM IST

పసుపు పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పాలలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇలాంటి పాలను రాత్రి పడుకునే ముందు తాగితే మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి

యాంటీ ఇన్ఫ్లమేటరీ

పసుపును పాలలో కలిపి తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని వాపు కూడా తగ్గిసోతుంది. ఇది కీళ్ల నొప్పులు ఉన్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

రోగనిరోధక శక్తి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పసుపు పాలను రోజూ పడుకునే ముందు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ తో పాటుగా ఎన్నో సీజనల్ రోగాలకు దూరంగా ఉంటారు. ఇది అనారోగ్యసమస్యలొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 

Latest Videos


Turmeric Milk


జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

పసుపు పాలు మన మెమోరీ పవర్ ను పెంచడానికి కూడా బాగా సహాయపడతాయి. కొన్ని పరిశోధనా పత్రాల ప్రకారం.. పసుపు పాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మెదడు  న్యూరోట్రోఫిక్ కారకాలను మెరుగుపరుస్తాయి. ఈ పాలు మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

కార్డియోవాస్కులర్ సమస్యలను తగ్గిస్తుంది

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తనాళాల లైనింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. అాలగే ధమనుల్లో ఫలకం ఏర్పడడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

ప్రశాంతమైన మనసు

రాత్రి నిద్రపోవడానికి ముందు పసుపు పాలను తాగడం వల్ల మెదడు గ్రాహకాలను ప్రభావవంతంగా శాంతపరుస్తుంది. ఈ పాలు మన ఆలోచనలను చాలా వరకు తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే ఈ పసుపు పాలు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. 

Turmeric Milk

చర్మానికి ప్రయోజనాలు

పసుపు పాలు వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. పసుపు పాలను తాగడం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే కొత్తగా మొటిమలు అయ్యే అవకాశం తగ్గుతుంది. అలాగే చర్మం రంగు, ఆకృతి కూడా మెరుగుపడుతుంది. 

click me!