మందు తాగుతూ వీటిని తింటే మీ పని అంతే..!

First Published | May 14, 2024, 4:39 PM IST

ఆల్కహాల్ తాగేటప్పుడు తినడానికి ఏదైనా పక్కాగా ఉండాల్సిందేనంటారు చాలా మంది. కానీ మందు తాగేటప్పుడు కొన్ని ఫుడ్స్ ను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవేంటంటే?
 

ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ సంగతి తాగే వారికి కూడా తెలుసు. అయినా తాగుతుంటారు. దీనికి అలవాటు పడ్డవారికి ఎంత చెప్పినా మందును మాత్రం మానరు. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు ఏదో ఒకటి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఆ అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మందుతో పాటుగా కొన్ని ఆహారాలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరి ఆల్కహాల్ తో ఏమేమి తినకూడదంటే? 
 

Citrus Fruits

పుల్లని ఆహారాలు

నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ఆల్కహాల్ ను తాగేటప్పుడు మాత్రం వీటిని తీసుకోకూడదు. మందు తాగుతూ వీటిని తింటే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
 

Latest Videos


ఉప్పు ఆహారం

మందు తాగేటప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తాగేలా చేస్తుంది. ఎందుకంటే ఇది దాహం ఎక్కువయ్యేలా చేస్తుంది. 
 

షుగర్ ఫ్రీ శీతల పానీయాలు

చక్కెర శీతల పానీయాలలోని చక్కెర ఆల్కహాల్ ను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి గ్రహించడానికి కారణమవుతుంది. కానీ షుగర్ ఫ్రీ శీతల పానీయాలు మీరు ఆల్కహాల్ ఎక్కువ తాగేలా చేస్తాయి. అందుకే మందు తాగేటప్పుడు వీటిని మాత్రం తాగకూడదు. 
 

బ్రెడ్

బీర్ తాగితే బ్రెడ్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్, బ్రెడ్ ఈస్ట్ నుంచి తయారవుతాయి. అలాగే ఈస్ట్ తో తయారైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అపానవాయువు లేదా అజీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 
 

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం

ఆల్కహాల్ ను తాగుతూ వేయించిన ఆహారాలను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ కాంబినేషన్ బాగుంటుందని ఇలా చేస్తుంటారు. కానీ మందు తాగుతూ వేయించిన ఆహారాలు వంటి జిడ్డుగల ఆహారాన్ని తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. అందుకే మందు తాగుతూ ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది.
 

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, వెన్న, ఐస్ క్రీం వంటి డైరీ ఫుడ్స్ ను కూడా ఆల్కహాల్ తీసుకునే ముందు లేదా తర్వాత తినడం మానుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ తో పాల ఉత్పత్తులు తినడం వల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

click me!