తిన్న తర్వాత ఏం చేయొద్దు?

First Published May 14, 2024, 12:36 PM IST

తిన్న తర్వాత కొన్ని పనులను చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మనలో చాలా మంది చేయకూడనే పనులనే చేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. అసలు తిన్న తర్వాత ఏం పనులు చేయొద్దో తెలుసా?

కొంతమంది తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం బయట తిరగడం, స్మోకింగ్ చేయడం, స్నానం చేయడం లాంటి పనులను చేస్తుంటారు. కానీ తిన్న తర్వాత మీరు చేసే కొన్ని పనుల వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత మీరు నివారించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే జీవక్రియను ప్రభావితం చేస్తుంది.దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

నిద్ర

మనలో చాలా మందికి తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. కొంతమంది నిద్రను ఆపుకుంటే మరికొంతమంది మాత్రం తిన్న వెంటనే కునుకు తీస్తుంటారు. ఇలా తిన్న వెంటనే పడుకోవడం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కానీ తిన్న వెంటనే పడుకోవడం వల్ల మీ జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. అలాగే ఆహార అణువులను విచ్ఛిన్నం చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి హెవీగా తిన్న తర్వాత వెంటనే నిద్రపోకుండా చూసుకోండి. 

Latest Videos


smoking

ధూమపానం 
 
కొంతమంది తిన్న వెంటనే స్మోకింగ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే జీవక్రియ తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత 1 సిగరెట్ కాల్చడం 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.

స్నానం

హెవీగా తిన్న తర్వాత వెంటనే స్నానం చేయడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణ ప్రక్రియను లేట్ చేస్తుంది. ఎందుకంటే స్నానం కడుపు చుట్టూ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది స్నానం చేస్తుంటే  శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. అలాగే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

పండ్లు

పండ్లు ఆరోగ్యకరమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే అజీర్ణానికి దారితీస్తుంది. భోజనానికి 2 గంటల ముందు లేదా తర్వాత పండ్లు తినడం మంచిది. ఇది జీవక్రియను పెంచడానికి,  పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది.
 

టీ

టీ లో కెఫిన్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే కాఫీ తాగితే ఆహారం జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. నిజానికి తిన్న వెంటనే ఒక కప్పు టీ తాగితే ఆహార అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే అజీర్ణానికి కారణమవుతుంది. ఇది ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ ను కష్టతరం చేస్తుంది. భోజనం తర్వాత టీ తాగడం వల్ల ఇనుము శోషణ నిరోధించబడుతుంది. అందుకే భోజనం తర్వాత టీ తాగకపోవడమే మంచిది.

click me!