కాఫీ తాగడానికి కరెక్టు టైం ఏంటో తెలుసా?

First Published | Nov 30, 2023, 9:46 AM IST

మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉన్నారు. కాఫీతోనే డేను స్టార్ట్ చేస్తుంటారు. కాఫీ మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. నిద్రమత్తును వదిలిస్తుంది. ఇంతకు మించి కాఫీ నుంచి వచ్చే కమ్మని వాసన, ఆ రుచి కాఫీని తాగేలా చేస్తుంది. ఇదంతా బానే ఉంది. కానీ కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. దీన్ని తాగడానికి కూడా ఒక టైం ఉంటుంది తెలుసా? 
 

కాఫీని తాగడానికి సరైన సమయం ఉంటుందన్న ముచ్చట మీకు తెలుసా? కానీ అవేమీ పట్టించుకోకుండా మనలో చాలా మంది ఉదయం, సాయంత్రం, నిద్రపోయే ముందు కాఫీని తాగుతుంటారు. రోజుకు ఐదారు సార్లు కాఫీని తాగేవారు కూడా ఉన్నారు. నిజానికి కాఫీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే అని చెడు చేయదని కూడా కాదు. కాఫీని మరీ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాఫీని తాగితే నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఈ నిద్రలేమి గుండెజబ్బులు, క్యాన్సర్, హార్మోన్ల సమస్యలు వంటి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

కాఫీ తాగడానికి ఉత్తమ సమయం ఏదంటే? 

శరీరంలో కార్టిసాల్ పెరిగితే మీరు ఒత్తిడికి గురవుతారు. కార్టిసాల్ అనేది ఒక హార్మోన్. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ కార్టిసాల్ రోజంతా మీ శక్తి స్థాయిలను, ఒత్తిడి స్థాయిలను నిర్ణయిస్తుంది. అయితే ఉదయం మనం నిద్రలేవగానే శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఉదయాన్నే కాఫీని తాగితే శరీరంలోని నేచురల్ ఎనర్జీ తగ్గుతుంది. అందుకే ఉదయాన్నే కాఫీని తాగకూడదు. 
 

Latest Videos


Image: Freepik

మీకు తెలుసా? పరిగడుపున కాఫీని తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. దీంతో మీ ఛాతీలో మంటగా అనిపిస్తుంది. మీరు ఉదయం లేచిన 1-2 గంటల తర్వాత మాత్రమే కాఫీని తాగాలి.  కాఫీని తాగడానికి ఇది సరైన సమయమని నిపుణులు అంటున్నారు. అలాగే మీరు తినడానికి ముందు కాఫీని తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

coffee

కాఫీని ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సమస్యలు

మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే కాఫీని తాగకండి. ఎందుకంటే ఇది మీ బీపీని మరింత పెంచుతుంది. దీంతో మీకు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే హై బీపీ పేషెంట్లు కెఫిన్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి. 

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలా మంది అవసరానికి మించి కాఫీని తాగుతుంటారు. కానీ మోతాదుకు మించి కాఫీని తాగడం వల్ల మీ జీర్ణక్రియ క్షీణిస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

Image: Getty

కాఫీని ఎక్కువగా తాగితే మీ ఎముకలపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో మీ కీళ్లలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. 

మీరు తరచూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే.. కాఫీకి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ నిద్రపై ప్రభావం చూపుతుంది. ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. అందుకే కాఫీని ఎక్కువగా అస్సలు తాగకండి. 
 

click me!