Health Tips: దగ్గు, జలుబు తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి

First Published Nov 29, 2023, 12:37 PM IST

చికిత్స కంటే నివారణే మంచిదన్న సంగతిని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. నిజానికి నివారణ మన ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా ఉంచుతుంది. అయితే చలికాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

చలికాలంలో వీచే చల్లని గాలులు మనల్ని జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడేస్తాయి. ఇక వీటిని తగ్గించుకోవడానికి హాస్పటల్ కు వెళ్లడమో, లేకపోతే ఓవర్ ది కౌంటర్ మందులను వాడటమో చేస్తుంటాం. అయితే ఈ రెండూ కాకుండా కూడా కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దగ్గు, జలుబును తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఏం మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉప్పునీటి గార్గిల్

ఉప్పు నీటి గార్గిల్ ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు గొంతు నొప్పి, గొంతులో గరగర, దురద, గొంతు పొడిబారడం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతేంటే ఉప్పు నీటితో గార్గిల్ చేయండి. ఇందుకోసం గ్లాసు గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ ఉప్పును కలపండి. దీనితో రోజుకు రెండుసార్లు పుక్కిలించండి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గు తొందరగా తగ్గేలా చేస్తుంది. 
 

Latest Videos


పసుపు పాలు

పసుపు పాలలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపును కలిపి తాగితే దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు పాలను తాగితే ముక్కు కారడం ఆగుతుంది. గొంతునొప్పి తగ్గుతుంది. 
 

హైడ్రేటెడ్ గా ఉండండి

మీకు జలుబు అయితే మీరు ఖచ్చితంగా హైడ్రేట్ గా ఉండాలి. ఇందుకోసం మీరు తగినంత నీటిని, ద్రవాలను తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ద్రవాలు శ్లేష్మం సన్నబడటానికి సహాయపడుతాయి. 
 

తేనె

తేనెలో కూడా దివ్య ఔషదగుణాలుంటాయి. దీన్ని ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఏండ్ల కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. మీకు తెలుసా? తేనెను తీసుకుంటే గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే దగ్గు రాకుండా చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో ఛాతీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. 
 

ఆవిరి

ఆవిరిని పీల్చడం కూడా ప్రయోజకరంగానే ఉంటుంది. ఇది నాసికా రద్దీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను మిక్స్ చేయండి. నాసికా మార్గాలను క్లియర్ చేయడానికి, శ్వాస బాగా తీసుకోవడానికి మీ చుట్టూ ఒక టవల్ ను ఉంచి ఆవిరిని 10-15 నిమిషాలు పీల్చండి.
 

విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, 

విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇది దగ్గును, జలుబును తొందరగా తగ్గిస్తుంది. ఇందుకోసం నిమ్మకాయ, ఉసిరి, నారింజ, వంటి సిట్రస్ పండ్లను తినండి. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండే కూరగాయలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 

click me!