ముద్దు వ్యాధి ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
నిపుణుల ప్రకారం.. ఈ వ్యాధి పిల్లలలో పాటుగా యుక్తవయసు వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చిన్న పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్టు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ టీనేజర్లు, 20 ఏండ్లు ఉన్నవారికి తీవ్రమైన మోనో లక్షణాలు కనిపిస్తాయి. ఏదేమైనా వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.