రోజూ బ్రౌన్ రైస్ తింటే..!

Published : Apr 11, 2023, 07:15 AM IST

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలంటరు ఆరోగ్య నిపుణులు. అయితే వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైసే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.   

PREV
15
 రోజూ బ్రౌన్ రైస్ తింటే..!
Image: Getty Images

ఈ మధ్యకాలంలో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ నే ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నిజానికి తెల్లబియ్యంలో పోషకాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. తెల్ల బియ్యాన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి తప్ప.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ. ఈ బ్రౌన్ రైస్ ను దాని  బయటి పొట్టును తొలగించి తయారు చేస్తారు. 
 

25
Image: Getty Images

ఈ బ్రౌన్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది మొలకెత్తిన బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటారు. అయితే బ్రౌన్ రైస్ ను వండటానికి ముందు కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. అసలు ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

35
Image: Getty Images

 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది

బ్రౌన్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఇన్సులిన్ వచ్చే చిక్కులను తగ్గిస్తుంది. అంతేకాదు బ్రౌన్ రైస్ లో కార్భోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇది శరీరంలో చక్కెర శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అలాగే డయాబెటిస్  ను నియంత్రించడానికి సహాయపడుతుంది. 

45

గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ నే ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ధమనులు మూసుకుపోవడం, గుండె సమస్యలు, స్ట్రోకులు, గుండె అలసట వంటి హృదయ సంబంధ సమస్యలను నివారిస్తుంది. ఇది రక్తపోటుతో పాటు ధమనుల గట్టిపడటం వంటి ఇతర వాస్కులర్ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మొత్తంమీద ఇది మీ హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

55

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బ్రౌన్ రైస్ లో  ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ మలం సాఫీగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. మన శరీరానికి ఫైబర్ కంటెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మానవులలో సాధారణ, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు బ్రౌన్ రైస్ బాహ్య భాగంలో బ్రాన్ పొరను కలిగి ఉంటుంది. ఇది అధిక ఆమ్ల శోషణను నిరోధిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 

click me!

Recommended Stories