అపోహ: మీరు తరచుగా వినే ఒక విషయం ఏమిటంటే హోమియోపతి,అల్లోపతి మందులు కలిపి తీసుకోలేము.
వాస్తవం: అందులో ఎలాంటి నిజం లేదు. ఇతర సాంప్రదాయ నివారణలతో పాటు హోమియోపతి మందులు కూడా తీసుకోవచ్చు. తీసుకోకూడదు అనేది అపోహ మాత్రమే. తమ వద్దకు వచ్చే చాలా మంది రోగులు మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాంప్రదాయ లేదా మూలికా ఔషధాలను తీసుకుంటారు. అల్లోపతి వైద్యాన్ని వెంటనే ఆపేయమని తాము వారికి చెప్పమని, కాకపోతే... వాటిని కాస్త తగ్గించమని మాత్రమే చెబుతామని నిపుణులు చెబుతున్నారు.