వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది చాలా కామన్. కానీ వీటిపట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చిన్న సమస్య కాస్త పెద్ద వ్యాధులుగా మారతాయి. ముఖ్యంగా ఆడవారు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో అందరికీ తెలిసిందే. కానీ పురుషులు మాత్రం ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ఆఫీసు లేదా ఇంటిలో బిజీగా ఉండటం వల్ల పురుషులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అలాగే కొన్ని సమస్యల లక్షణాలు కనిపించినా వాటిని పట్టించుకోరు. ఈ చిన్న విషయానికి హాస్పటల్ కు వెళ్లాలా అని అనుకుంటారు. ముఖ్యంగా 30 ఏండ్లు పడిన తర్వాత పురుషులకు కొన్ని సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ప్రారంభంలో వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులుగా మారుతాయి. ఇంతకీ 30 ఏండ్ల వయసులో మగవారికి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బలహీనమైన ఎముకలు
30 ఏండ్ల వయసు నుంచే ఎముకల ఆరోగ్యం బలహీనపడటం మొదలవుతుంది. ఈ వయసులో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న ఎముకల పగుళ్లు, కీళ్ల నొప్పుల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ వయసు నుంచే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనితో పాటుగా వ్యాయామం చేయాలి.
గుండె జబ్బులు
వయసు పెరుగుతున్న కొద్దీ గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. తప్పుడు ఆహారాలు, జీవనశైలి మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్నిచూపుతాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే ధమనులలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం మొదలవుతుంది. కాబట్టి శరీరాన్ని చురుకుగా ఉంచడానికి మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
బరువు పెరగడం
ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరిగే సమస్య కూడా 30 ఏండ్ల వయసులో ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలోపెరుగుతున్న కొవ్వును తగ్గించడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం హెల్తీ ఆహారాలను తినాలి. శారీరక శ్రమ పెంచాలి.
prostate cancer
ప్రోస్టేట్ క్యాన్సర్
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మూత్రంలో మంట, నిద్రపోతున్నప్పుడు మూత్రవిసర్జన లేదా వృషణాలలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇవన్నీ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలే.
baldness in men
బట్టతల సమస్య
పురుషుల్లో బట్టతల సమస్య కూడా వృద్ధాప్యంతో చాలా సాధారణం. సూర్యరశ్మి, కాలుష్యం, తప్పుడు ఆహారాలు, పోషకాల లోపం మొదలైనవి బట్టతలకు కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రారంభంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బట్టతల పెరిగినప్పుడు దానిని ఆపడం కష్టమవుతుంది. కాబట్టి బిజీ లైఫ్ స్టైల్ లో ఆహారంలో ఐరన్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి.