రాత్రి 9 గంటల తర్వాత తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 12, 2024, 2:13 PM IST

చాలా మంది రాత్రి 9, 10 దాటిన తర్వాతనే అన్నం తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును రాత్రి 9 గంటల తర్వాత తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

ఉరుకుల పరుగుల జీవితంలో దీనికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ కాలంలో సరిగ్గా తినడానికి కూడా సమయం లేనివారున్నారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది హెల్తీ ఫుడ్ ను తినలేకపోతున్నారు. అలాగే సరైన సమయాన్ని కూడా పాటించడం లేదు. దీనివల్లే ఎంతో మంది లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. 

అయితే చాలా మందికి రాత్రిపూట లేట్ గా తినే అలవాటు ఉంది. అంటే రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు తింటుంటారు. కొంతమంది అయితే ఏకంగా 12 గంటల తర్వాతే తింటుంటారు. ఇలా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్లకు వాళ్లే అనుకుంటుంటారు. కానీ ఇలా రోజూ లేట్ గా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


dinner

మనం ఆరోగ్యంగా ఉండటానికి హెల్తీ ఫుడ్ తో పాటుగా భోజన సమయం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు వీటిని సరిగ్గా పాటించకపోతే మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలుసా.. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బాగా బరువు పెరుగుతారు. అలాగే జీర్ణ సమస్యలు వస్తాయి. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన సమస్యలు కూడా వస్తాయి. 

అంతేకాదు ప్రతిరోజూ రాత్రి పూట ఆలస్యంగా పడుకోవడం వల్ల భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రిపూట ఎక్కువగా ఆహారం తినడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ లెవల్స్ లో మార్పు వస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో స్ట్రోకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని రక్త నాళాలు పగిలి రక్తస్రావం అవుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. ఇది కూడా పక్షవాతానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

click me!