ఎక్కువ సేపు నిద్రపోతే ఏమౌతుంది?

First Published | May 12, 2024, 1:34 PM IST

కొంతమంది చాలా తక్కువ సమయం మాత్రమే పడుకుంటారు. మరికొంతమంది పది పదకొండు గంటలు కంటిన్యూగా నిద్రపోతూనే ఉంటారు. కానీ పడుకోవాల్సిన టైం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

కొందమందికి అస్సలు నిద్ర పట్టదు. కొందరికి ఇలా ఒరగగానే అలా నిద్రలోకి జారుకుంటారు. అయితే చాలా మంది ఎంత తొందరగా నిద్రపోయినా ఏడెనిమిది గంటలు మాత్రమే పడుకుంటుంటారు. కానీ మరికొందరు మాత్రం విపరీతంగా నిద్రపోతారు. అంటే రోజులో చాలా టైం నిద్రకే కేటాయిస్తుంటారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 
 

ఒత్తిడి

ఒత్తిడి చిన్న సమస్య అని తీసిపారేయడానికి లేదు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఎక్కువ సేపు నిద్రపోయే వారిని రెండు, మూడు గ్రూపులుగా విభజించి వారికి అధిక ఒత్తిడి సమస్య ఉన్నట్టు గుర్తించారు. అవును అతి నిద్రకూడా ఒత్తిడిని పెంచుతుంది. 
 

Latest Videos


గర్భం దాల్చడంలో ఇబ్బంది

ఎక్కువ సేపు నిద్రపోయే మహిళలు తల్లులు కావడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ పరిశోధనలో.. ఎక్కువసేపు నిద్రపోయే మహిళలు గర్భం ధరించే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు.

రుతుచక్రం

నిద్ర సమయంలో వ్యత్యాసం మన శరీరంలోని హార్మోన్ గ్రంథుల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే ఇది ఇర్రెగ్యులర్ రుతుచక్రానికి కారణమవుతుంది. దీనివల్ల పీరియడ్స్ సమయలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

డయాబెటిస్

రాత్రిపూట ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతంగా ఉంటుంది. దీన్ని పూర్తిగా తగ్గించుకోలేరు.
 

బరువు పెరగడం

అతిగా నిద్రపోవడం వల్ల కూడా బరువు విపరీతంగా పెరిగిపోతారు. స్థూలకాయానికి, బరువు పెరగడానికి నిద్ర సమయం కూడా ఒక ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట ఎనిమిది గంటలకు పైగా నిద్రపోయే మహిళలు అధిక బరువు బారిన పడినట్టు గుర్తించారు. 
 

click me!