రాత్రిపూట స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published May 22, 2024, 4:57 PM IST

ఎండాకాలంలో ఉదయంతో పాటుగా రాత్రిపూట కూడా స్నానం చేస్తుంటారు. ఇది చెమటను, మురికిని వదిలిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ రాత్రిపూట స్నానం చేస్తే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
 

రోజూ స్నానం చేయడం వల్ల ఒంటికి పట్టిన చెమట, దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. అయితే చాలా మంది ఉదయమే కాకుండా రాత్రిపూట కూడా స్నానం చేస్తుంటారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఒంటికి హాయిగా అనిపిస్తుంది. నిద్రకూడా బాగా పడుతుంది. కానీ రాత్రిపూట స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా? 

bathing

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఒత్తిడి మనం అనుకునేంత చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక  ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్  సమతుల్యం అవుతుంది. దీంతో మీ ఒత్తిడి తగ్గి రాత్రిపూట మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. 
 

చర్మ ఆరోగ్యం

మనం ఎక్కడికెక్కడో పనికి వెళుతుంటాం. దీనివల్ల వాయు కాలుష్యం, దుమ్ము, ధూళి శరీరానికి అంటుకుంటాయి. దీనివల్ల మన చర్మానికి క్రిములు, బ్యాక్టీరియా కూడా అంటుకుంటాయి. దీంతో చర్మం చిరాకు పెడుతుంది. అయితే రాత్రిపూట స్నానం చేయడం వల్ల అవి ఇవన్నీ పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా కూడా ఉంటుంది. 
 

నాణ్యమైన నిద్ర

నిద్రలేమితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. నిద్రలేమి వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. ఇది మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

రొమాన్స్

మీరు రాత్రిపూట సంభోగంలో పాల్గొంటే.. దానికంటే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే రాత్రిపూట స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే మీ శరీరం పునరుత్తేజం పొందుతుంది.
 

శరీరానికి విశ్రాంతి

రోజంతా పనిచేయడం వల్ల మీ శరీరం,  కండరాలు బాగా అలసిపోతాయి. దీనివల్ల మీకు ఏ పనీ చేతకాదు. అయితే రాత్రిపూట స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే శరీరానికి కూడా రెస్ట్ దొరుకుతుంది. 

Latest Videos

click me!