పరిగడుపున కరివేపాకు జ్యూస్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 25, 2024, 3:33 PM IST

మనలో చాలా మంది కరివేపాకును అస్సలు తినరు. కానీ కూరలో మాత్రం కరివేపాకు ఉండాలంటారు. ఎందుకంటే ఇది మంచి టేస్ట్ ను, వాసనను ఇస్తుందని. కానీ కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అవును మీరు గనుక రోజూ పరిగడుపున కరివేపాకు రసం తాగితే.. 
 

మనం తినే కూరల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు ఖచ్చింతంగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని కేవలం టేస్ట్, మంచి వానస కోసమే వేస్తారు. అందుకే కూరలో వీటిని తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే మీకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర, పుదీనా సంగతి పక్కన పెడితే కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని అలాగే తిన్నా, జ్యూస్ గా చేసుకుని తాగినా ఎన్నో  సమస్యలు తగ్గిపోతాయి తెలుసా? ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కరివేపాకు బరువును తగ్గించడం నుంచి శరీరంలో రక్తాన్ని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు కరివేపాకు రసాన్ని తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

curry leaves

కరివేపాకులో ఉండే పోషకాలు

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

Latest Videos


రక్తంలో చక్కెర అదుపు

డయాబెటీస్ పేషెంట్లకు కరివేపాకు రసం ఒక మెడిసిన్ పనిచేస్తుంది. అవును దీనిలో ఉండే హైపోగ్లైసీమిక్ లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అలాగే ఈ రసంలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ శరీరంలో ఇన్సులిన్ స్పైక్ లను నివారించడానికి బాగా సహాయపడుతుంది. 
 

anemia

రక్త నష్టం తొలగిపోతుంది

ఆడవాళ్లకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్లు ఉదయాన్నే పరిగడుపున కరివేపాకు రసం తాగితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. కరివేపాకులో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం లోపాన్ని తగ్గిస్తుంది. అలసట, బలహీన వంటి సమస్యలను కూడా తగ్గిపోతుంది. 

cataract

కంటిశుక్లం నివారణ

కరివేపాకులో విటమిన్ ఎ
 పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కంటిచూపును మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజూ  కరివేపాకు జ్యూస్ ను గనుక తాగినట్టైతే కంటిశుక్లం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

weight loss

బరువును అదుపులో..

మీరు రోజు రోజుకు బరువు పెరిగిపోతున్నట్టు అనిపిస్తే వెంటనే  కరివేపాకు జ్యూస్ ను మీ రెగ్యులర్  డైట్ లో చేర్చుకోండి. ఎందుకంటే కరివేపాకు మీ శరీరాన్ని నిర్విషీకరణగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి నిర్విషీకరణ చాలా అవసరం. బాడీ డిటాక్స్ వల్ల మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు. దీనివల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

click me!