పరిగడుపున 2 లవంగాలు తింటే ఏమవుతుందో తెలుసా?

First Published | Jul 20, 2024, 12:04 PM IST

లవంగాలు ఒక మసాలా దినుసులు. వీటిని ఫుడ్ లోనే ఉపయోగించాలని చాలా మంది అంటుంటారు. కానీ వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. అది కూడా ఉదయాన్నే. వీటిని ఉదయాన్నే తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? 

లవంగాలు మసాలా దినుసులే కాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషదాలు కూడా. అవును ఈ మసాలా దినుసులు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ చిన్న చిన్న మసాలా దినుసుల్లో విటమిన్ సి,విటమిన్ ఎ, సోడియం, పొటాషియం,  విటమిన్ బి, ఫోలేట్, నియాసిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, గ్లూకోజ్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని గనుక తింటే మనం ఎన్నో రోగాల ముప్పు నుంచి తప్పించుకుంటాం. రోజూ ఉదయాన్నే రెండు లవంగాలను నమలడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

దంత సమస్యలు నయం 

చాలా మందికి దంతాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కానీ హాస్పటల్ కు మాత్రం వెళ్లరు. అలాగే నొప్పిని భరిస్తూ ఉంటారు. కానీ మీరు ఈ సమస్యలను తగ్గించుకోవడానికి లవంగాలను కూడా ఉపయోగించొచ్చు. అవును లవంగాల్లో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. వీటిని ఉదయం పరిగడుపున నమలడం వల్ల పంటి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. నోరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పంటినొప్పితో బాధపడేవారు రోజూ రెండు లవంగాలను నమిలితే సమస్య కొన్ని రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది.


మెరుగైన జీర్ణక్రియ

లవంగాలను ఉపయోగించి మీరు జీర్ణసమస్యలను కూడా తొందరగా తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ఉదయం పరిగడుపున రెండు లవంగాలను నమలడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తి

మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే మాత్రం తరచుగా రోగాల బారిన పడాల్సి వస్తుంది. అయితే లవంగాల్లో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే వీటిని ఉదయాన్నే పరిగడుపున తింటే కూడా మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 
 

బలమైన ఎముకలు 

లవంగాలు మన ఎములకను బలంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. లవంగాల్లో మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే  పరిగడుపున 2 లవంగాలను నమలడం వల్ల మన ఎముకలు బలంగా అవుతాయి. కీళ్ల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. 

ఒత్తిడిని తగ్గిస్తాయి

లవంగాలు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటిని పరిగడుపున తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. లవంగాల్లో యాంటీఆక్సిడెంట్  లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ లక్షణ మార్పులను నిరోధిస్తాయి. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించే గుణాలు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. 

బరువు తగ్గుతారు 

లవంగాలు మీరు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అవును నిపుణుల ప్రకారం.. మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున 2 లవంగం మొగ్గలను నమలడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది.  దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గడం మొదలవుతుంది. 

జలుబు, దగ్గు నుండి ఉపశమనం

ఉదయాన్నే పరిగడుపున మీరు రెండు లవంగలను నమలడం వల్ల దగ్గు, జలుబు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు నుంచి మనల్ని రక్షిస్తాయి. 

Latest Videos

click me!