రోజూ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | May 12, 2024, 4:17 PM IST

చాలా మందికి రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కాఫీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా? హాని చేస్తుందా? అన్న సంగతిని ఎవరూ పట్టించుకోరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒక కప్పు కాఫీని తాగితే ఏమౌతుందో తెలుసా? 

చాలా మంది ఇష్టంగా తాగే పానీయాల్లో కాఫీ ఒకటి. నిజానికి కాఫీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇది మన స్టామినాను పెంచుతుంది. అందుకే చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీని తాగి డేను స్టార్ట్ చేస్తుంటారు. కానీ కాఫీని తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న మాట మీకు తెలుసా? అసలు రోజూ ఒక కప్పు కాఫీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది

కాఫీలో కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన అలసటను చిటికెలో పోగొడుతుంది. అలాగే శరీరంలో మన శక్తి స్థాయిలను పెంచుతుంది. ఎలా అంటే కాఫీలోని కెఫిన్ అడెనోసిన్ అని పిలువబడే న్యూరోట్రాన్స్మిటర్ గ్రాహకాలను నియంత్రిస్తుంది. ఇది డోపామైన్ తో పాటుగా మీ శక్తి స్థాయిలను నియంత్రించే మీ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయిలను పెంచుతుంది.
 


టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తక్కువ

రెగ్యులర్ గా కాఫీని తాగడం వల్ల దీర్ఘకాలికంగా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇది మంట, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా కాఫీని మోతాదులో తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది

మానసిక ఆరోగ్యం

ప్రతిరోజూ కెఫిన్ ను తీసుకునేవారికి పార్కిన్సన్ వ్యాధి వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.
 

బరువు తగ్గడానికి

కాఫీని తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవును కాఫీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. ఎలా అంటే కాఫీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ గా పనిచేస్తుంది.

కాలేయానికి మేలు

కాఫీని తాగితే దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలెయ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
 

Latest Videos

click me!