ఈ కప్పుల్లో టీ తాగడం ఇంత డేంజరా?

First Published | Jan 5, 2024, 7:15 AM IST

సాధారణంగా రోడ్డు పక్కన టీ స్టాల్స్ లో పేపర్ కప్పుల్లో టీని టీని ఇస్తారు. కానీ ఈ కప్పులో టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు పేపర్ కప్పుల్లో టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. టీ మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కొంతమంది టీని గ్లాస్, కప్పుల్లో తాగుతుంటారు. కానీ రోడ్డు పక్కనున్న దుకాణాల్లో టీ ని ఎక్కువగా పేపర్ కప్పుల్లోనే పోస్తారు.  

paper cup

ఈ పేపర్ కప్పులను ఉపయోగించిన తర్వాత కడగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టీ తాగి  చెత్తబుట్టలో పడేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం ఈ రకమైన కప్పులను ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్ఫెనాల్ ఉంటుంది. ఇది శరీరానికి హానికరం. ముఖ్యంగా ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.
 

 వీటిలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములు కూడా ఉంటాయి. ఈ కప్పుల్లో ఉపయోగించే పూతలలో ఈ హానికరమైన బిస్ఫెనాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయి. మనం టీ తాగినప్పుడు అది నేరుగా కడుపులోకి వెళ్తుంది.
 

paper cup tea

ప్రతిరోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో బీపీఏ పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఇక నుంచైనా ఈ పేపర్ కప్పుల్లో టీ తాగడం మానుకోండి.

click me!