Weight Loss Tips: లెమన్ వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతరా?

First Published Jan 4, 2024, 7:15 AM IST

Weight Loss Tips: చలికాలంలో బరువును కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సీజన్ ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. అలాగే  ఫుడ్ ను మోతాదుకు మించి తింటారు. దీనివల్ల బరువు బాగా పెరిగిపోతారు. బరువును కంట్రోల్ చేయడానికి లెమన్ వాటర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ వాటర్ బరువును ఎలా తగ్గిస్తుందంటే?
 

చలికాలంలో జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలతో పాటుగా శరీర బరువు కూడా విపరీతంగా పెరుగుతుంది. మీరు గమనించారో లేదో ఈ సీజన్ లో మనకు  ఆకలి ఎక్కువగా అవుతుంది. దీని వల్ల కొంతమంది రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అందులోనూ చలి వల్ల శారీరక శ్రమ కూడా చేయరు. అలాగే ఈ సీజన్ లో మజీర్ణక్రియ కూడా సక్రమంగా జరగదు. దీనివల్ల బరువు పెరగడం మొదలవుతుంది. కానీ బరువు పెరిగితే లేని పోని రోగాలు వస్తాయి. అందుకే దీన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. 

చలికాలంలో చాలా మంది తమ శరీర బరువును నియంత్రించడానికి ఎన్నో చేస్తుంటారు. వీటిలో నిమ్మకాయ రసాన్ని తాగడం ఒకటి. బరువు తగ్గడాని కని చాలా మంది ఉదయాన్నే లెమన్ ను వాటర్ ను తాగుతుంటారు. నిజానికి ఖాళీ కడుపుతో తేనె నిమ్మరసం తాగడం వల్ల మీ బరువు తగ్గుతుంది. అయినప్పటికీ ఈ వాటర్ కేవలం మీ శరీర బరువును తగ్గించడంతో పాటుగా ఎన్నో ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అవేంటో తెలుసుకుందాం పదండి. 

ఆకలిని నియంత్రిస్తుంది

ఖాళీ కడుపుతో తేనె, నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందని కొంతమంది నమ్ముతారు. దీనివల్ల మీరు రోజంతా అతిగా తినకుండా ఉంటారు. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచడానికి నిమ్మకాయ నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఇది పోషకాలను బాగా గ్రహించడానికి దారితీస్తుంది. అలాగే బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

lemon water

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

తేనెలోని గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువగా ఉంటుంది. లిమిట్ లో దీన్ని నిమ్మరసంలో వేసుకుని తాగడం డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తేనె, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే తీపి పదార్థాలను తినాలన్న కోరికలు కూడా తగ్గిపోతాయి. 
 

మెటబాలిజం రేటు పెరుగుతుంది

తేనె, నిమ్మకాయ కలయిక మీ జీవక్రియ రేటును పెంచుతుందని నమ్ముతారు. దీంతో శరీరంలో అదనంగా ఉన్న కేలరీలు కరగడం స్టార్ట్ అవుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి దారితీస్తుంది. 
 

హైడ్రేట్ గా ఉంచండి

బరువు తగ్గడానికి మనం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. తేనె, నిమ్మకాయ నీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండదు. శరీరంలో నీటి సరఫరా ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
 

శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది

నిమ్మరసం గొప్ప నిర్విషీకరణ పానీయంగా కూడా పరిగణించబడుతుంది. ఇది జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
 

click me!