ఇంట్లోనే ఆలు 65 ఇలా సులువుగా తయారు చెయ్యండి!

First Published Nov 14, 2021, 1:41 PM IST

బంగాళదుంపలు (Potato) మనం ఎన్నో విధంగా వంటలలో వాడుతుంటాం. ఇందులో శరీరానికి మేలు చేసే అనేక పోషకవిలువలు ఉన్నాయి. ఆలుతో మసాలా కూరలు, వేపుళ్ల వంటివి వండుతారు. అయితే ఎప్పుడూ చేసుకునే కూరలు కాకుండా వెరైటీగా ఆలూ 65 ను ట్రై చేసి చూడండి. ఇది మీకు ఎంతగానో నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఆలూ 65 (Aloo 65) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: 250గ్రా బంగాళదుంపలు (Potatoes), మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour), రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), తగినంత ఉప్పు (Salt), ఆయిల్ (Oil), ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు (Garlic), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక ఉల్లిపాయ (Onion), కొన్ని కరివేపాకు రెమ్మలు (Curries), సగం టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం టేబుల్ స్పూన్ ధనియాల పొడి (Coriyander powder), తగినంత కారం (Red chilli powder), 150 గ్రా పెరుగు (Curd), కొత్తిమీర (Coriyander).
 

తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను నీటిలో శుభ్రపరచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్ళు (Water) పోసి స్టవ్ మీద పెట్టి 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను వడగట్టి నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలను తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, తగినంత ఉప్పు (Salt) వేసి కలపాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ ల నీళ్లు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
 

స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి తక్కువ మంటలో (Low flame) ఢీ ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంపలు మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ (Oil) వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.
 

ఈ మసాలా పొడులు (Masala powder) వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల పెరుగు వేసి బాగా కలపాలి. నిమ్మరసం కూడా పిండాలి. మీకు మంచి కలర్ కావాలంటే ఫుడ్ కలర్ ను వాడవచ్చు. ఫుడ్ కలర్ వద్దనుకుంటే వాడకండి. ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి పెరుగు (Curd) కలుపుకున్న మిశ్రమంలో ఆలు వేసి ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. మిశ్రమమంతా దగ్గరపడ్డాక చివరలో తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలు 65 రెడీ. దీన్ని మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి. ఇది మీకు నచ్చుతుంది.

click me!