విటమిన్ డి శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చుంటే మన శరీరం కావాల్సినంత విటమిన్ డి తీసుకుంటుంది. కానీ అంత తీరిక, ఓపిక, అవకాశం చాలామందికి ఉండటం లేదు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఎప్పుడూ కోపంగా, బాధగా ఉండటం విటమిన్ D లోపం వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైందని అంటున్నారు నిపుణులు. అంతేకాదు విటమిన్ D మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందట. ఈ విటమిన్ లోపం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.