Perfume Usage: ఈ ఆరుగురు పొరపాటున కూడా పర్ఫ్యూమ్ వాడకూడదు తెలుసా?

Published : Feb 21, 2025 3:37 PM IST

మనలో చాలామంది రెగ్యులర్ గా పర్ఫ్యూమ్ వాడుతుంటారు. మంచి వాసన రావడానికి, చెమట వాసన దాచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కానీ పర్ఫ్యూమ్ అందరికి సెట్ కాదట. కొంతమంది అయితే పర్ఫ్యూమ్ అస్సలు వాడకూడదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

17
Perfume Usage: ఈ ఆరుగురు పొరపాటున కూడా పర్ఫ్యూమ్ వాడకూడదు తెలుసా?

చాలామంది రకరకాల పర్ఫ్యూమ్ లు వాడుతుంటారు. మంచి మంచి వాసనలు వచ్చే వాటిని ఎంపిక చేసుకుంటారు. ఇవి రోజంతా సువాసన వెదజల్లుతుంటాయి. చెమట వాసన బయటకు రాకుండా చేస్తాయి. కొందరైతే పర్ఫ్యూమ్ వేసుకోకుండా అస్సలు బయటకే వెళ్లరు.

పర్ఫ్యూమ్ ఎంత మంచి వాసన వెదజల్లిన కొందరు వీటిని అస్సలు వాడకూడదు అంటున్నారు నిపుణులు. మరి ఎవరు వాడకూడదు? దాని వల్ల కలిగే ఇబ్బందులెంటో ఇక్కడ చూద్దాం.

27
శ్వాస సమస్యలు ఉన్నవారు:

ఆస్తమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా పర్ఫ్యూమ్ వాడకూడదట. ఒకవేళ పర్ఫ్యూమ్ వాడాలనుకుంటే ఎక్కువ సువాసన ఉన్నది వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

37
ప్రెగ్నెంట్స్:

పర్ఫ్యూమ్‌లో ఉండే కొన్ని రసాయనాలు గర్భిణీలకు అంత మంచిది కాదట. ఇవి తలనొప్పి, వికారం కలిగిస్తాయి. కాబట్టి, గర్భిణీలు పర్ఫ్యూమ్ వాడకుండా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

47
చిన్న పిల్లలు:

చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, సెంటు వాళ్ళకి చర్మ సమస్యలు కలిగిస్తుంది. ఇది కాకుండా, శ్వాస సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చిన్న పిల్లలు పర్ఫ్యూమ్ లకు దూరంగా ఉండటమే మంచిది.

57
చర్మ సమస్యలు ఉన్నవాళ్లు:

పర్ఫ్యూమ్‌లలో ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు పర్ఫ్యూమ్ వాడకుండా ఉండటం మంచిది. లేదంటే దురద, మంట లాంటి చర్మ సమస్యలు వస్తాయి.

67
తలనొప్పి ఉన్నవాళ్లు:

తలనొప్పి సమస్య ఉంటే పర్ఫ్యూమ్ అస్సలు వాడకండి. లేదంటే తలనొప్పి ఇంకా ఎక్కువ అవ్వడమే కాకుండా వికారం, తల తిరగడం లాంటి సమస్యలు కూడా వస్తాయి.

77
ఎక్కువసేపు ఎండలో ఉండేవాళ్లు:

పర్ఫ్యూమ్‌లలో ఉండే కొన్ని రసాయన పదార్థాలు ఎక్కువసేపు ఎండలో ఉండేవాళ్ళకి రియాక్షన్ కలిగిస్తాయి. దీనివల్ల చర్మం దురద, రంగు మారడం లాంటి సమస్యలు వస్తాయి.

Read more Photos on
click me!