Viagra Side Effects: అస‌లు వ‌యాగ్రా ట్యాబ్లెట్ ఎలా ప‌ని చేస్తుంది.? త‌ర‌చూ వాడితే ఏమవుతుందో తెలుసా.?

Published : Aug 03, 2025, 12:01 PM ISTUpdated : Aug 03, 2025, 12:02 PM IST

వయాగ్రా ట్యాబ్లెట్స్ గురించి చాలా మంది వినే వింటారు. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి.? వీటి ఉప‌యోగం ఏంటి.? త‌ర‌చూ వాడితే ఏం జ‌రుగుతుంది.? లాంటి అంశాల‌పై మాత్రం క్లారిటీ ఉండ‌దు. ఇలాంటి ఎన్నో ఆసక్తిక‌ర విష‌యాలు డాక్ట‌ర్ స‌మ‌రం గారి మాటల్లోనే తెలుసుకుందాం. 

PREV
15
ఎరక్టైల్ డిస్ఫంక్షన్

కొంత మంది పురుషుల్లో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉంటుంది. అంటే అంగం స్థంభించకపోవడం. ఇలాంటి సమస్య ఉన్న వారు సిన్లాఫిల్ వంటి ట్యాబ్లెట్స్‌ను ఉప‌యోగిస్తారు. వీటినే వ‌యాగ్రాగా పిలుస్తారు. వీటిలో ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ వాటిని సిన్లాఫిల్‌గా సెకండ్ జ‌న‌రేష‌న్ ట్యాబ్లెట్స్‌ను.. టాడాల్ఫినో, ఇక మూడో జ‌న‌రేష‌న్‌ను వెర్నాఫిలోగా చెబుతుంటారు.

DID YOU KNOW ?
స‌రాదా కోసం కాదు
వయాగ్రా ట్యాబ్లెట్స్ దీర్ఘకాలిక ఎంజైమ్ డిఫెక్ట్ సమస్యతో బాధపడే పురుషుల కోసం తయారు చేశారు. దీనిని సరదాగా వాడ‌కూడ‌దు.
25
అస‌లీ ట్యాబ్లెట్స్ ఉద్దేశం ఏంటంటే.?

సాధార‌ణంగా పురుషుల్లో అంగం స్థంభించ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వారిలో ఎంజైమ్స్‌లో డిఫెక్ట్ ఉండ‌డం. కొంద‌రిలో ఈ ఎంజైమ్ డిఫెక్ట్ అనేది తాత్కాలికంగా ఉంటే మ‌రికొంద‌రిలో దీర్ఘకాలంగా ఉంటుంది. వ‌యాగ్రా వంటి ట్యాబ్లెట్స్‌ను దీర్ఘ‌కాల ఎంజైమ్ డిఫెక్ట్‌తో బాధ‌ప‌డేవారి కోసం త‌యారు చేశారు. ఏదో స‌ర‌దాగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకూడ‌దు.

35
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.?

శారీర‌కంగా క‌ల‌వాల‌నుకునే స‌మ‌యంలో ఈ ట్యాబ్లెట్స్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. వీటివ‌ల్ల పెద్ద‌గా సైడ్ ఎఫెట్స్ ఉండ‌వు. అయితే కొంత‌మందిలో మాత్రం దుష్ప్ర‌భావం ఉంటుంది. ఇలాంటి వారి రెగ్యుల‌ర్‌గా కాకుండా గ్యాప్ ఇస్తూ ట్యాబ్లెట్స్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

45
వైద్యులను సంప్ర‌దించే తీసుకోవాలి

వ‌యాగ్రా ట్యాబ్లెట్స్‌ను చాలా మంది వైద్యుల సూచ‌న లేకుండానే వాడుతుంటారు. అయితే ఇంది మంచి ప‌ద్ధ‌తి కాదు. మెడిక‌ల్ దుకాణాల్లో కూడా ఎలాంటి ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే వీటిని ఇస్తుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్స్‌ను ఉప‌యోగించే ముందు క‌చ్చితంగా వైద్యుల స‌ల‌హాలు తీసుకోవాల్సిందే. ఎవ‌రు వాడాలి.? ఎంత కాలం వాడాలి.? అన్న విష‌యాల‌ను వైద్యులు చెబుతారు.

55
ఎంత కాలం వాడొచ్చు.?

వైద్యుల స‌ల‌హామేర‌కు ఈ ట్యాబ్లెట్స్‌ను ఎంత కాల‌మైనా వాడుకోవ‌చ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అయితే ఉప‌యోగించే ముందు క‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అలాగే ట్యాబ్లెట్ ఉప‌యోగిస్తున్న స‌మ‌యంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్రదించాలి.

వయాగ్రా ట్యాబ్లెట్లకు సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి..

(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)

Read more Photos on
click me!

Recommended Stories