చాలామంది నోటి ఆరోగ్యం గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సరిగ్గా బ్రెష్ చేయకపోతే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇక్కడ చూద్దాం.
ప్రతిరోజూ బ్రెష్ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పళ్లు తోముకోవడం చిన్న విషయమే అయినప్పటికీ.. అది పెద్ద మార్పులను తెస్తుంది. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరిగ్గా బ్రెష్ చేయకపోతే నోటి దుర్వాసన మాత్రమే కాదు.. పేగులోని మంచి బ్యాక్టీరియా కూడా ప్రభావితమవుతుంది.
25
నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే..
నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా ఆహారంతో పాటు పేగులకు చేరుతుంది. అవి సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతేకాదు బ్యాక్టీరియా వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
35
బ్రెష్ చేయకపోతే..
ఉదయం పళ్లు తోముకోకుండా ఉండటం, రాత్రి తిన్న తర్వాత పళ్లు శుభ్రం చేసుకోకుండా నిద్రపోవడం చెడు అలవాట్లలో ఒకటి. దీనివల్ల నోటిలో పోర్ఫిరోమోనాస్ జింజివాలిస్, ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం వంటివి పెరుగుతాయి. ఇవి చిగుళ్ల వ్యాధికి కారణమవుతాయి.
ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఇవి నోటి నుంచి పేగులకు చేరి పేగులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దానివల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే కాలక్రమేణా జీర్ణవ్యవస్థలో వాపు, పేగుల లైనింగ్ బలహీనపడటం, లీకీ గట్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు నోటి పూత, చిగుళ్ల వాపు, రక్తస్రావం, దంతక్షయం వంటివి సంభవిస్తాయి. నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే గుండె, మెదడు, మొత్తం ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
55
రోజుకు రెండుసార్లు..
ఇలాంటి సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా పళ్లు తోముకోవాలి. తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం మంచిది. పళ్లకు హాని కలిగించే తీపి పదార్థాలను తగ్గించుకోవడం ఉత్తమం.