'మధ్యప్రదేశ్'లోని జబల్ పూర్ నగరంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు ఏవో తెలుసా?

First Published Nov 26, 2021, 4:41 PM IST

మధ్యప్రదేశ్ లోని నర్మదా నదీ (Narmada River) తీరాన జబల్ పూర్ నగరం ఉంది. భారతదేశానికి పాలరాతి నగరంగా జబల్ పూర్ ప్రసిద్ధి. భేదాఘాట్ లో ఉన్న పాలరాతి శిలల కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. జబల్ పూర్ తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. జబల్ పూర్ లోని అనేక దేవాలయాలు, డ్యాంలు, మ్యూజియం, కోటలు ఇంకా ఎన్నో ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ (Jabalpur) నగరంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

పాలరాతి శిల్పాలు, భేదాఘాట్: పాలరాతి శిల్పాలు (Marble sculptures), భేదాఘాట్ (Bhedaghat) జబల్ పూర్ అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం. నర్మదా నదికి అటూ ఇటూ నిలబడి ఈ పాలరాతి శిలలు వందల అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటక ప్రియులకు ప్రశాంతత కలుగుతుంది.
 

రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం: రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం (Rani Durgavati Memorial Museum) ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రాణి దుర్గావతి తన సేవలు జబల్ పూర్, చుట్టుపక్కల ప్రాంతానికి అందించినందుకు ఆమె గుర్తుగా 1964 లో ఈ మ్యూజియం నిర్మించబడింది.
 

ఈ మ్యూజియం రాచరికపు జీవన విధానం వారి విలాసాల (Luxuries) గురించి పర్యాటకులకు అవగాహన కల్పిస్తుంది. రాణి జీవితాన్ని వివిధ సమయాల్లో ఆమె పాలనను ఈ మ్యూజియం తెలుపుతుంది. ఈ మ్యూజియంలో నాణేలు, శిల్పాలు, యుద్ధ సామానులు, ఆయుధాలు, పుస్తకాలు, చిత్రలేఖనాలు పర్యాటకులకు దర్శనమిస్తాయి.
 

మదన్ మహల్ ఫోర్ట్:  మదన్ మహల్ ఫోర్ట్ (Madan Mahal Fort) లో 11వ శతాబ్దానికి చెందిన జబల్ పూర్   పాలకులు కొన్నేళ్లపాటు నివసించారు. కొండపై ఉన్న ఈ కోట నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను రాజ మదన్ సింగ్ నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ కోట రాణి దుర్గాదేవి సౌరభాన్ని, ఆవిడ పాలనా (Governance) యంత్రాంగాన్ని, సైన్యం గురించి తెలుపుతుంది.

హనుమాన్ తాల్ సరస్సు: జబల్ పూర్ లో ఉన్న హనుమాన్ తాల్ సరస్సు (Hanuman Tal Lake) నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం 52 సరస్సులు ఉన్నాయి. అందులో 13 ఎండిపోయాయి. జనాభా పెరగడంతో ఈ సరస్సులు కలుషితం (pollute) అయ్యాయి. ఇది ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రాంతం. హనుమంతుల వారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టినపుడు ఇక్కడ ఒక సరస్సు ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి. అప్పటినుంచి ఈ సరస్సును హనుమాన్ తాల్ గా పిలువబడుతోంది.  

సంగ్రామ్ సాగర్ లేక్: జబల్ పూర్ లోని మరొక ముఖ్య ఆకర్షణ ప్రదేశం సంగ్రామ్ సాగర్ లేక్ (Sangram Sagar Lake). ఇది నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ శతాబ్దంలో  గోండ్ రాజు అయిన సంగ్రామ్ షా చే  ఈ తటాకము, చుట్టుపక్కల నిర్మాణాలు నిర్మించబడినవి. ఈ లేక్ నీటి జంతువులకు, వలస పక్షులకు ప్రసిద్ధి. ఇక్కడి అందాలు (Beauties) పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగించి వారి ఒత్తిడిని తగ్గిస్తాయి.

click me!