ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

First Published Nov 26, 2021, 3:50 PM IST

మనం నిత్యం ఉపయోగించే కూరగాయలలో సొరకాయ (Bottle gourd) ఒకటి. ఇది అనేక పోషకాలను (Nutrients) కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సొరకాయలను మనం నిత్యం వంటకాలలో, స్వీట్ల తయారీలో వాడుతుంటాం. అయితే సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా అనేక పోషకాలను కలిగి ఉన్న సొరకాయను రెగ్యులర్ గా తీసుకోవడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
 

యాంటి ఆక్సిడెంట్స్ (Anti accidents) అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సొరకాయలో ఎక్కువ శాతం నీరు ఉండి తక్కువ కొలెస్ట్రాల్ (Cholesterol) ను కలిగి ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి చల్లదనాన్ని కలిగిస్తుంది. సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి
 

సొరకాయ జ్యూస్ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇందుకోసం సొరకాయ (Bottle gourd) ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర పొడి (Cumin powder), మిరియాల పొడి (Pepper powder), ఉప్పు (Salt), పుదీనా ఆకులు (Mint) వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ను తాగడంతో చర్మం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుంది.
 

దీంతో చర్మానికి తగినంత తేమను అందించి చర్మం ప్రకాశవంతంగా (Bright), ఆరోగ్యంగా (Healthy) ఉండేలా చేస్తుంది. సొరకాయ తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది. దీంతో శరీర బరువును తొందరగా తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి శరీర బరువును తగ్గిస్తుంది. సొరకాయ జ్యూస్ విరోచనాలను తగ్గించడానికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 

విరేచనాల కారణంగా శరీరం కోల్పోయిన ఖనిజాలను (Minerals) తిరిగి భర్తీ చేస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి కావలసిన విటమిన్ ఎ సొరకాయలో పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ తాగడంతో కంటి చూపు మెరుగుపడుతుంది. సొరకాయలో జింక్ పదార్థం (Zinc material) ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
 

శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండె ఆరోగ్యవంతంగా పనిచేయడానికి చక్కగా పనిచేస్తుంది. రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడే వారికి సొరకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. సొరకాయలో ఐరన్ (Iron) శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీన సమస్యలను దూరం చేస్తుంది.
 

కంటి చూపును మెరుగు పరచడానికి కావలసిన విటమిన్ ఎ సొరకాయలో పుష్కలంగా ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ (Urine infection) లను తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థపదార్థాలను (Waste products) సులభంగా బయటకు పంపిస్తుంది. సొరకాయలో పుష్కలంగా ఉండే క్యాల్షియం, మెగ్నీషియం కండరాలను బలోపేతం చేస్తాయి. తీవ్రమైన అతిసార, మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. ఈ విధంగా సొరకాయ జ్యూస్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలగజేస్తుంది.

click me!