Health benefit: కర్పూరంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

First Published Nov 26, 2021, 4:24 PM IST

తలనొప్పి తీవ్రంగా ఉంటే కర్పూరాన్ని నెయ్యితో కలిపి నుదుటిలో రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం నూనెలు కూడా తలనొప్పిని తగ్గిస్తాయి.
 

భగవంతుని పూజకు కర్పూరాన్ని ఉపయోగించడం సర్వసాధారణంగా తెలిసిన విషయం. అయితే కర్పూరం వల్ల కేవలం పూజ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఆయుర్వేద గ్రంథాలలో కర్పూరం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

జ్వరం..
జ్వరం, దగ్గు , జలుబు వంటి సాధారణ సమస్య. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరాన్ని  తీసుకుంటే.. వెంటనే తగ్గిపోతుందట.ఇది జ్వరం  తీవ్రతను తగ్గిస్తుంది.  తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నప్పుడు.. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కర్పూరం ఇవ్వడం కూడా ఉపయోగపడుతుంది. కలరాకు కర్పూరం ఉత్తమ ఔషధం

తలనొప్పి నుండి ఉపశమనం
తలనొప్పి తీవ్రంగా ఉంటే కర్పూరాన్ని నెయ్యితో కలిపి నుదుటిలో రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం నూనెలు కూడా తలనొప్పిని తగ్గిస్తాయి.

దోమలు, తేనటీగలు, కందిరీగలు  కరిచినప్పుడు చర్మం ఉబ్బిపోతుంది. తీవ్రమైన నొప్పి , దురద ఉంది. ఈ సమయంలో, కర్పూరాన్ని ఏదైనా పండ్ల రసంలో  కలిపి వాపు ఉన్న ప్రదేశంలో వెంటనే రాయాలి.  వెంటనే ఆ వాపు తగ్గుతుంది. ఆ జ్యూస్ తాగినా కూడా మంచిదేనట. వాటి వల్ల కలిగిన విష ప్రభావం తగ్గుతుందట.

అనుకోకుండా కొందరు అనారోగ్యం బారిన పడి.. వాంతులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు...  కర్పూరాన్ని  పాలతో కలిపి  తీసుకోవాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే..  ఆ పాలల్లో పంచదార మాత్రం కలపకూడదు.
 

వేడినీటిలో కొద్దిగా పంచదార, కర్పూరం వేసి కలుపుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల  కడుపులో నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా.. చేతులకు గాయమై రక్తం కారుతుంటే.. ఆ ప్రదేశంలో.. వెంటనే కర్పూరం ఉంచాలి. అలా చేయడం వల్ల.. రక్త స్రావం తగ్గుతుంది. గాయం కూడా వెంటనే నయమౌతుంది.

నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్పూరంలో పాలను తరచుగా తీసుకోవడం  వల్ల లైంగిక ఆసక్తి కూడా పెరుగుతుందట. అలాగే జలుబు, హిస్టీరియా, యోని తిమ్మిర్లు, కఫం, నిద్రలేమి  వంటి ఆరోగ్య సమస్యలకు  కూడా కర్పూరం ఉత్తమ ఔషధం. అయితే.. మంచిది అన్నారు కదా అని.. మితిమీరి తీసుకోకూడదు. ఇక పాలిచ్చే తల్లులు కూడా కర్పూరానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. కర్పూరం తల్లిలో పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. 

click me!