వెల్లుల్లిని తినడం అలవాటు చేసుకుంటే..!

First Published May 24, 2023, 7:15 AM IST

వెల్లుల్లిని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లి కూరను టేస్టీగా చేయడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని పచ్చిగా తిన్నా.. కూరలో తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

వెల్లుల్లిని ఎన్నో ఏండ్ల నుంచి పండిస్తున్నారు. ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వంటకాల్లో ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్ధం వెల్లుల్లి. శాస్త్రీయంగా అల్లియం సాటివమ్ అని పిలువబడే వెల్లుల్లి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ప్రసిద్ధ పదార్ధం. ఇది వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

రోగనిరోధక వ్యవస్థకు మద్దతు

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఎలాంటి రోగం, నొప్పి లేకుండా ఉంటాం. అయితే వెల్లుల్లి రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.
 

గుండె ఆరోగ్యం

వెల్లుల్లిలోని లక్షణాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని నిరూపించబడింది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఇది సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
 

Garlic

శోథ నిరోధక ప్రభావాలు

వెల్లుల్లిలో శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉన్న పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగించే దీర్ఘకాలిక మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణ ఆరోగ్యం

వెల్లుల్లిని చాలాకాలంగా జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి ప్రయోజనకరమైన గట్ ఫ్లోరా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. మంచి జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు వెల్లుల్లి ఉబ్బరం, గ్యాస్  జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. 
 

క్యాన్సర్ నివారణ

కొన్ని పరిశోధనల ప్రకారం.. వెల్లుల్లిని తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అయినప్పటికీ దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. 
 

మెరుగైన ఎముక ఆరోగ్యం

వెల్లుల్లిలో ఉండే మాంగనీస్, విటమిన్ సి, సెలీనియం ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు వెల్లుల్లి శోథ నిరోధక లక్షణాల ద్వారా ఎముక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 

click me!