హార్ట్ ఎటాక్ తో మగవారి కంటే ఆడవారే ఎక్కువ చనిపోతున్నారా?

Published : May 23, 2023, 12:51 PM IST

ప్రస్తుతం గుండెపోటుతో చనిపోయే వారు ఎక్కువయ్యారు. ఒకప్పుడు పెద్ద వయసు వారే గుండెపోట బారిన పడేవారు. కానీ ఇప్పుడూ స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుతో అర్థాంతరంగా చనిపోతున్నారు.   

PREV
17
హార్ట్ ఎటాక్ తో మగవారి కంటే ఆడవారే ఎక్కువ చనిపోతున్నారా?
Image: Getty

యూరోపియనన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ఈఎస్సీ) సైంటిఫిక్ కాంగ్రెస్ హార్ట్ ఫెయిల్యూర్ 23 లో సమర్పించిన పరిశోధనల ప్రకారం.. గుండెపోటుతో చనిపోయే అవకాశం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. 

మయోకార్డియల్ ఇన్ఫర్షన్ ఉన్న అంటే గుండెపోటు వచ్చిన అన్ని వయస్సుల మహిళలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి గుండెపోటు వచ్చిన మహిళలకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. అలాగే  రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను, డయాబెటీస్ ను ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. అప్పుడే వీరు సేఫ్ గా ఉంటారు. 

27
heart attack woman

ప్రస్తుతం యువతులు కూడా విపరీతంగా స్మోకింగ్ చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్మోకింగ్ కూడా గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును మానుకుని శారీరక శ్రమ చేయాలని, మెరుగైన జీవన శైలిని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 

37
Heart Attack

గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు పురుషులతో పోలిస్తే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫర్షన్ (స్టెమి) ఉన్న మహిళలలు హాస్పటల్ లో ఉన్నప్పుడు వారికి ఈ సమస్యలు ఉన్నాయని గుర్తించలేకపోయారని కనుగొన్నారు. వారి వృద్ధాప్యం, ఇతర సమస్యలు ఎక్కువగా ఉండటం, స్టెంట్ల తక్కువ వాడకం వల్ల ఇలా జరగొచ్చు. ఈ అధ్యయనం మహిళలు, పురుషులతో స్టెమి తర్వాత స్వల్ప, దీర్ఘకాలిక ఫలితాలను పోల్చింది. రుతువిరతికి ముందు అంటే 55 నుంచి అంతకంటే తక్కువ వయసు, రుతువిరతి అంటే 55 ఏండ్లు పైబడిన మహిళల్లో లింగ వ్యత్యాసాలు స్పష్టంగా ఉన్నాయా అని పరిశీలించింది. 

47
heart attack

ఈ  అధ్యయనంలో 884 మంది రోగులు పాల్గొన్నారు. వీరి సగటు వయస్సు 62 సంవత్సరాలు. వీరిలో 27 శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళలు పురుషుల కంటే పెద్దవారు. అంటే వీరి సగటు వయస్సు 67 నుంచి 60 సంవత్సరాలు. వీరికి అధిక రక్తపోటు, డయాబెటీస్, ముందస్తు స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నాయి. పురుషులు స్మోకింగ్ చేసేవారు, కొరోనరీ ఆర్టరీ వ్యాధులను కలిగున్నారు. అయితే పురుషులు, మహిళల చికిత్స వ్యవధిలో తేడా ఏం లేదు. కానీ 55, అంతకంటే తక్కువ వయసున్న మహిళలు తోటి పురుషులతో పోలిస్తే హాస్పటల్ కు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. అంటే ఆడవారు 95 నిమిషాలు తీసుకుంటే.. పురుషులు కేవలం 80 నిమిషాల సమయమే తీసుకున్నారు. 

57

డయాబెటీస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె ఆగిపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పరిధీయ ధమని వ్యాధి, స్ట్రోక్, కొరోనరీ ఆర్టరీ వ్యాధి కుటుంబ చరిత్రతో సహా  గుండెపోటును ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకున్న తర్వాత పరిశోధకులు ఆడవారు, మగవారి మధ్య ప్రతికూల ఫలితాల ప్రమాదాన్ని పోల్చారు. 30 రోజులలో 4.6% మంది పురుషులతో పోలిస్తే 11.8% మంది మహిళలు మరణించారు. ప్రమాద నిష్పత్తి 2.76 (హెచ్ ఆర్). ఐదేండ్లలో దాదాపు మూడింట ఒక వంతు మంది మహిళలు అంటే 32.1% మంది మరణించారు. అలాగే 16.9% మంది పురుషులు చనిపోయారు. 19.8% మంది పురుషులతో పోలిస్తే మూడింట ఒక వంతు మంది మహిళలు ఉన్నారు. 

67
heart attack

హైపర్ టెన్షన్, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, స్మోకింగ్ తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాద కారకాల ప్రకారం.. పరిశోధకులు పురుషులు, మహిళలను సరిపోల్చారు. 55 ఏండ్లు, అంతకంటే తక్కువ వయసున్న పురుషులు, మహిళల మధ్య, 55 ఏండ్లు పైబడిన పురుషులు, మహిళల మధ్య ప్రతికూల ఫలితాలను పోల్చారు.

77
heart attack

సరిపోల్చిన విశ్లేషణలో 435 మంది రోగులున్నారు. 55 ఏళ్లు పైబడిన రోగులలో అన్ని ప్రతికూల ఫలితాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించాయి. 3.0% మంది పురుషులతో పోలిస్తే 11.3% మంది మహిళలు 30 రోజులలోపు మరణించారు.  ప్రమాద నిష్పత్తి 3.85. ఐదేండ్లలో 15.8% మంది పురుషులతో మూడింట ఒక వంతు మంది మహిళలు (32.9%) మరణించారు. మొత్తంగా గుండెపోటుతో చనిపోయే అవకాశం పురుషులతో పోలిస్తే ఆడివారికే ఎక్కువగా ఉంది. 

click me!

Recommended Stories